రైతే భర్తగా రావాలంటున్న మీనాక్షి.. ఎందుకో తెలుసా?
ఇకపోతే తనకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టమని, ఆ ప్రకృతిలో విహరించడం మరింత సంతోషం అంటూ చెప్పుకొచ్చింది.
By: Madhu Reddy | 13 Jan 2026 7:45 PM IST2024 సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం'. ఈ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇక సంక్రాంతి సెంటిమెంట్ గా గత ఏడాది (2025) అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది..ఇప్పుడు మళ్లీ 2026 సంక్రాంతికి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడమే కాకుండా సంక్రాంతి హీరోయిన్గా పేరు దక్కించుకోవడానికి సిద్ధమయ్యింది మీనాక్షి చౌదరి.
అందులో భాగంగానే తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న 'అనగనగా ఒక రాజు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రేపు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మీనాక్షి చౌదరి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఆయనకు ఎలాంటి లక్షణాలు ఉండాలి ?అనే విషయాలను ఓపెన్ గా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. తనకు ఒక రైతే భర్తగా రావాలని చెప్పిన ఈమె, ఎందుకు రైతును భర్తగా కోరుకుంటోందో కూడా చెప్పి ఆశ్చర్యపరిచింది.
మీనాక్షి మాట్లాడుతూ.." నాకు కాబోయే భర్త నటుడు, డాక్టరు అయి ఉండకూడదు.ముఖ్యంగా మిస్టర్ ఇండియా టైటిల్స్ గెలిచిన వ్యక్తి అసలే వద్దు. ఎందుకంటే నేను ఇప్పటికే ఆ హోదాలలో ఉన్నాను. ముఖ్యంగా నా ఫేవరెట్ డిష్ రాజ్మా. ఈ రాజ్మాను 100 ఎకరాలలో పండించే ఒక వ్యక్తి నా భర్తగా రావాలి. ఇక మూడు పూటలా నాకు గిఫ్ట్లు ఇచ్చేవాడు అయి ఉండాలి. వంట చేయాలి.. బట్టలు ఉతకాలి.. ప్రేమగా నాకు తినిపించాలి. ఇక నాకంటే చాలా హైట్ గా ఉండే వ్యక్తి నా భర్తగా రావాలి " అంటూ తన భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది మీనాక్షి.
ఇకపోతే తనకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టమని, ఆ ప్రకృతిలో విహరించడం మరింత సంతోషం అంటూ చెప్పుకొచ్చింది. అలా మీనాక్షి చేసిన ఈ కామెంట్లు విన్న నెటిజన్స్ మొత్తానికి నీకు ఒక రైతు భర్తగా రావాలన్నమాట అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కాలంలో రైతుకు మించిన ధనవంతుడు మరొకరు లేరు.. అందుకే మీనాక్షి అలా కోరుకుంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం మీనాక్షి అనగనగా ఒక రాజు సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించారు. ఇందులో గోపరాజు రమణ, చమ్మక్ చంద్ర , మధుసూదన్ రావు, మహేష్ ఆచంట, భద్రం, కాదంబరి కిరణ్ కుమార్ , అనంత్ బాబు, తారక్ పొన్నప్ప, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ ప్రధానంగా వస్తున్న ఈ సినిమా రేపు థియేటర్లలో ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
