చౌదరి బ్యూటీ ఒక్కసారిగా సైలెంట్!
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటీమణుల్లో మీనాక్షి చౌదరి ఒకరు.
By: Srikanth Kontham | 30 Jun 2026 9:00 PM ISTటాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటీమణుల్లో మీనాక్షి చౌదరి ఒకరు. గ్లామర్, పెర్ఫార్మెన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ స్పీడ్ పెద్దగా కనిపించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. రెండేళ్ల క్రితం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోయిన మీనాక్షి అకస్మాత్తుగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం వెనుక ఉన్న కారణాలేంటి? రెండేళ్ల కాలంలో రెండే రెండు సినిమాలకే పరిమితం కావడం కెరీర్‌కు మైనస్ అవుతుందా? అనే ప్రశ్నలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి.
మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో యాక్టివ్‌గా బ్యాక్-టు-బ్యాక్ ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఎంపిక చేసుకున్న చిత్రాల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ సుదీర్ఘ విరామం వెనుక కారణం పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోవడమా? లేక తానే స్వయంగా మంచి ప్రాజెక్టుల కోసం వేచి చూస్తోందా? అనేది గమనార్హం. టాలీవుడ్‌లో గ్లామర్ తారలకు ఉండే డిమాండ్‌ను బట్టి చూస్తే ఈ స్థాయిలో గ్యాప్ తీసుకోవడం కెరీర్ పరంగా కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే.
నిజానికి మీనాక్షి చౌదరి సైలెంట్ కావడానికి కారణం హైపర్ సెలక్టివిటీ అని ఇండస్ట్రీ వర్గాల టాక్ ఉంది. చిన్న సినిమాల్లో నటించి ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడం కంటే అగ్ర హీరోల సరసన భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే మాట వినిపిస్తుంది. అయితే ఈ పద్ధతిలో రిస్క్ ఎక్కువ. ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ కోసం వేచి చూసే క్రమంలో మధ్యలో వచ్చే మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. రెండేళ్లలో రెండే సినిమాలు చేయడం అంటే? బాక్సాఫీస్ వద్ద మీనాక్షి ఉనికిని కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు.
ఇక్కడే హీరోయిన్ల మార్కెట్ విజిబిలిటీ ని గమనించాలి. గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్లకు చాలా తక్కువ సమయమే ఉంటుంది. ప్రేక్షకులకు నిరంతరం కళ్ల ముందు కనిపిస్తూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటేనే వారిలో ఆసక్తి ఉంటుంది. మీనాక్షి చౌదరి గనుక మరో ఏడాది పాటు సైలెంట్‌గా ఉంటే తర్వాతి తరం కొత్త హీరోయిన్లు ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఖాయం. స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే అందం, అభినయం ఉంటే సరిపోదు. సరైన సమయంలో సరైన ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉండాలి అన్నది సీనియర్ల వెర్షన్.
ప్రస్తుతం మీనాక్షి తీసుకున్న విరామం వ్యూహాత్మకమైనదా? లేక అనివార్యమా? అనేది కాలమే చెప్పాలి. బహుశా ఏదైనా భారీ ప్రాజెక్ట్ కోసమో లేదా ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకునేలా పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నారేమో చూడాలి. ఏదేమైనా? మీనాక్షి చౌదరి లాంటి ప్రతిభావంతురాలు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గ్యాప్ తీసుకోవడం అభిమా నులను నిరాశ పరుస్తోంది. అయితే మీనాక్షి చౌదరి కెరీర్‌ను మళ్ళీ ఫామ్‌లోకి రావడానికి ఇది సరైన సమయం అంటున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న కాంపిటీషన్ దృష్ట్యా, మౌనంగా ఉండటం కంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరించడం ఎంతో ముఖ్యం. బ్యూటీ, టాలెంట్‌కు తోడుగా కమర్షియల్ సక్సెస్ కూడా తోడైతేనే టాప్ లీగ్‌లో కొనసాగగలరు. సైలెన్స్‌ను బ్రేక్ చేసి మీనాక్షి త్వరలోనే మళ్లీ బిజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
