అక్కడా మీనాక్షి పాదం మోపుతోందా?
చిన్న సినిమాతో నటిగా ప్రయాణం మొదలు పెట్టిన అమ్మడు అనతి కాలంలో స్టార్ హీరోలకు ప్రమోట్ అయినా? ఇంకా ఆస్టార్ లీగ్ లో మాత్రం చేరలేదు.
By: Srikanth Kontham | 8 Feb 2026 1:00 AM ISTహర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రతిభకు తగ్గ అవకాశాలు అందుకోవడంలో వెనుకబడుతోంది. చిన్న సినిమాతో నటిగా ప్రయాణం మొదలు పెట్టిన అమ్మడు అనతి కాలంలో స్టార్ హీరోలకు ప్రమోట్ అయినా? ఇంకా ఆస్టార్ లీగ్ లో మాత్రం చేరలేదు. సెకెండ్ లీడ్స్ లోనే కంటున్యూ అవుతోంది. వెనుక వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం ఉన్నా? ఛాన్సులు అందుకోవడంలో వెనుకబడిందంటే? అదృష్టం కలిసి రాకనే అనాలి. ఇటీవలే విడుదలైన `అనగనగా ఒక రాజు`తోనూ మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా విమర్శకుల ప్రశంస లందుకుంది.
మీనాక్షి పాత్రకు మంచి పేరొచ్చింది. కానీ అమ్మడి తాజా లైనప్ చూస్తే మాత్రం ఖాళీగానే ఉంది. ప్రస్తుతం చేతిలో ఉంది `వృషకర్మ` ఒక్కటే. ఇందులో యువ సామ్రాట్ నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం మినహా కొత్త ప్రాజెక్టే ఏది చేతిలో లేదు. ఈ సినిమా విజయం సాధించినా? వెంటనే మరో సినిమాకు సైన్ చేసే గ్యారెంటీ కూడా కనిపిం చడం లేదు. ఇవన్నీ అమ్మడు ముందుగానే గెస్ చేసిందో ఏమోగానీ తాజాగా మీనాక్షి చౌదరి ఫోకస్ శాండిల్ వుడ్ పై మళ్లించినట్లు కనిపిస్తోంది. కన్నడ స్టార్ రక్షిత్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుందని వార్తలొస్తున్నాయి.
కిరణ్. రాజ్. కె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `777చార్లీ` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కన్నడలో మరో 100 కోట్లు రాబట్టిన చిత్రాల జాబితాలో చార్లీ నిలిచింది. ఈ నేపథ్యంలోనే రక్షిత్ తో మరోప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా తొలుత కన్నడ నటినే తీసుకో వాలనుకున్నారు. కానీ మీనాక్షి చౌదరి ఆ పాత్రకు పర్పెక్ట్ గా సూటవ్వడంతో ఆమెని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షికి సరైన సమయంలో వస్తోన్న అవకాశం ఇది. ఇప్పటికే తెలుగు సహా తమిళ్ లో కూడా సినిమాలు చేసింది.
కానీ కోలీవుడ్ లో కూడా బిజీ అవ్వలేదు. బాలీవుడ్ లో అదృష్టాన్ని ఆరంభంలోనే నిరూపించుకునే ప్రయత్నం చేసింది. `అప్ స్టేర్స్` అనే చిత్రంతోనే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అటుపై బాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో టాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడిక్కాడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ టంతో? కన్నడ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది. మరి అక్కడైనా కలిసొస్తుందా? లేదో చూడాలి. ప్రస్తుతం అన్ని చోట్ల హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి జంప్ అవుతున్నారు. మడి కట్టుకుని కూర్చోకుండా పని చేస్తున్నారు. కానీ మీనాక్షి చౌదరి మాత్రం గ్లామర్ ఎలివేషన్లకు దూరంగా ఉంటుంది. అదే అమ్మడికి టాలీవుడ్ లో ప్రతికూలంగా మారింది.
