Begin typing your search above and press return to search.

మీనాక్షి జోరు జీరోకి ద‌గ్గ‌ర‌లో!

అదే స‌మ‌యంలో కోలీవుడ్ లో `కోలై `చిత్రంతో లాంచ్ అయింది. అక్క‌డా అనుకున్న‌ట్లుగా అవ‌కాశాలు బాగానే వ‌రించాయి.

By:  Srikanth Kontham   |   30 Aug 2025 6:00 PM IST
మీనాక్షి జోరు జీరోకి ద‌గ్గ‌ర‌లో!
X

టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చింది మీనాక్షి చౌద‌రి. తొలి సినిమా `ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు`తో డీసెంట్ హిట్ అందుకుంది. ఆ సినిమా రిలీజ్ కు ముందే అమ్మ‌డిలో ప్ర‌తిభ‌ను గుర్తించిన గురూజీ త్రివిక్ర‌మ్ స‌క్సెస్ అవుతుంద‌ని ముందే జోస్యం చెప్పారు. ఆయ‌న అన్న‌ట్లుగానే స‌క్సెస్ అయింది. వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ న‌టిగా మారింది.` గుంటురు కారం`లో సెకెండ్ లీడ్ ఛాన్స్ ఇచ్చి గురూజీ సైతం ప్రోత్స హించారు. అంత‌కుముందే `హిట్ ది సెకెండ్ కేస్` తో మ‌రోహిట్ ఖాతాలో వేసుకుంది.

అదే స‌మ‌యంలో కోలీవుడ్ లో `కోలై `చిత్రంతో లాంచ్ అయింది. అక్క‌డా అనుకున్న‌ట్లుగా అవ‌కాశాలు బాగానే వ‌రించాయి. ఆరంభంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` లో ఛాన్స్ అందు కుంది. మొత్తంగా గత ఏడాది ఆరు సినిమాలతో ప్రేక్ష‌కుల మధ్య‌లోనే ఉంది. కానీ వాటిలో విజ‌యాలెన్ని అంటే? ఒకటి రెండే క‌నిపిస్తున్నాయి. మ‌రి ఈ వైఫ‌ల్యాలు మీనాక్షి జోరుకు బ్రేక్ లు వేసాయా? ఆజోరు జీరోకి కూడా పడిపోయే అవ‌కాశం ఉందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది.

ఈ ఏడాది `సంక్రాంతికి వ‌స్తున్నాం `తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. అదీ సెకెండ్ లీడ్ లోనే. సినిమా పెద్ద విజ‌యం సాధించినా? చేతిలో కొత్త సినిమాలైతే ఏవీ క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం `అన‌గ‌న‌గా ఒక రోజు` అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇది మీనాక్షి కెరీర్ లో ఏమాత్రం ఊహించ‌న‌ది. అమ్మ‌డు స్పీడ్ కు స్టార్ లీగ్ లో చేర‌డం పెద్ద ప‌నిగా క‌నిపించ‌లేదు. స‌క్సెస్ తో వ‌చ్చిన గుర్తింపు..పెర్పార్మ‌ర్ కావ‌డంతో? ఆ ట్యాలెంట్ తో స్టార్ లీగ్ ఈజీ అనుకున్నా? చేతిలో ఛాన్సులు లేక‌పోవ‌డం అన్న‌ది వెన‌క్కి లాగుతోంది.

మ‌రి అమ్మ‌డు ఈ ద‌శ‌ను ఎలా దాటుంతుందో చూడాలి. ప్ర‌స్తుతం నాయిక‌ల మ‌ధ్య పోటీ ఎలా ఉంది? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటేనే అవకాశాలు వ‌స్తున్నాయి. పైగా మీనాక్షి చౌద‌రి కొన్ని ప‌రిమితుల‌తోనే న‌టిగా కొన‌సాగుతోంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు తొలి నుంచి దూరంగానే ఉంది. ఆ కార‌ణంగానూ కొన్ని అవ‌కాశాలు కోల్పోయింది. మ‌రి ఇప్పుడు ఛాన్సులు లేని వేళ స‌డ‌లింపు ఇస్తుందా? ఇచ్చినా ఇండ‌స్ట్రీ కొత్త చాన్సులు క‌ల్పిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.