మీనాక్షి కొత్త జర్నీ... విమర్శలు తప్పవా?
తెలుగు ప్రేక్షకులకు ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.
By: Ramesh Palla | 27 Sept 2025 11:47 AM ISTతెలుగు ప్రేక్షకులకు ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. తెలుగులో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చాయి. గత ఏడాదిలో ఈమెకు లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ దక్కింది. గత ఏడాదిలో ఈమె తెలుగులో గుంటూరు కారం, మట్కా, మెకానిక్ రాకీ సినిమాలతో పాటు రెండు తమిళ సినిమాలు సైతం చేసింది. కానీ లక్కీ భాస్కర్ మినమా మిగిలిన సినిమాలు పెద్ద విజయాన్ని కట్టబెట్టలేదు. ఈ ఏడాదిలో ఈమెకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం దక్కింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మీనాక్షి చౌదరి ఫుల్ బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పటి వరకు ఒకే ఒక్క తెలుగు సినిమాను ఈమె కమిట్ అయింది. వస్తున్న చిన్న కథలను సున్నితంగా తిరస్కరిస్తున్న మీనాక్షి వద్దకు పెద్ద ఆఫర్లు రావడం లేదని టాక్.
బాలీవుడ్‌లో ఎంట్రీకి మీనాక్షి రెడీ
మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమాపై కూడా మీనాక్షి చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2025 సంక్రాంతి మాదిరిగానే 2026 సంక్రాంతికి భారీ విజయం ఖాయం అని ఆమె ధీమాతో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ ధీమా కారణంగానే ఈ ఏడాదిలో ఇతర సినిమాలను ఎక్కువగా కమిట్ కావడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. తెలుగులో కొత్త సినిమాలకు సున్నితంగా నో చెబుతున్న మీనాక్షి చౌదరి హిందీలో మాత్రం నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్‌లో నటించాలని కోరుకుంటున్నారు. కనుక మీనాక్షి చౌదరి సౌతం బాలీవుడ్‌లో అడుగు పెట్టాలని ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది.
జాన్ అబ్రహం ఫోర్స్ 3 మూవీలో...
బాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి ఎంట్రీకి రంగం సిద్దం అయింది. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఫోర్స్ ప్రాంచైజీ మూడో పార్ట్‌లో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. బాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించిన మేకర్స్ సంతృప్తి చెందలేదని, సౌత్ కి చెందిన హీరోయిన్స్‌లోనూ ఇద్దరు ముగ్గురిని పరిశీలించి చివరకు మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారని తెలుస్తోంది. భావ్ ధులియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మీనాక్షి చౌదరి బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతోంది. మరి ఈ సినిమాతో ఆమెకు హిట్ దక్కేనా చూడాలి. బాలీవుడ్‌లో మీనాక్షి ఎంట్రీ ఇవ్వడం అనేది ఆమెకు గుడ్ న్యూస్. కానీ ఆమె అభిమానులు మాత్రం కాస్త అసహనంతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరికి ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే బాగుంటుంది. కానీ బాలీవుడ్‌లో సినిమాలు చేయడం అది కూడా పెద్దగా స్టార్‌డం లేని జాన్ అబ్రహంతో సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అభిమానులు ఈ విషయంలో కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరిని ట్యాగ్ చేస్తూ బాలీవుడ్ సినిమా ఎంపిక గురించి విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి కి ఉన్న స్టార్‌డం కి తెలుగులో మంచి సినిమా ఆఫర్లు వస్తాయి, బాలీవుడ్‌లోనూ యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే స్థాయి ఆమెది. అయినా కూడా ఎందుకు జాన్ అబ్రహం వంటి సీనియర్‌తో నటించాలంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమా పూర్తి అయిన తర్వాత కూడా మీనాక్షి చౌదరికి విమర్శలు తప్పకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
