Begin typing your search above and press return to search.

మీనాక్షి చౌద‌రికి బంప‌ర్ ఆఫ‌ర్!

టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన మీనాక్షి చౌద‌రి స్పీడ్ ఒక్క‌సారిగా స్లో అయింది.

By:  Srikanth Kontham   |   4 Sept 2025 11:58 AM IST
మీనాక్షి చౌద‌రికి బంప‌ర్ ఆఫ‌ర్!
X

టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన మీనాక్షి చౌద‌రి స్పీడ్ ఒక్క‌సారిగా స్లో అయింది. `ల‌క్కీ భాస్క‌ర్`, `సంక్రాంతికి వ‌స్తున్నాం` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లున్నా? 2025 లో మాత్రం ఒక్క అవ‌కాశం కూడా అందుకోలేక‌పోయింది. దీంతో మీనాక్షి స్లో అయింద‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ట్యాలెంటెడ్ బ్యూటీకి అవ‌కాశాలు రాక‌పోవ‌డం ఏంట‌నే చ‌ర్చ షురూ అయింది. `అన‌గ‌న‌గా ఒక రోజు` అనే సినిమా చేస్తున్నా? ఆ చిత్రం గురించి ఎలాంటి అప్ డేట్ కూడా లేక‌పోవ‌డంతో మీనాక్షి పేరు ఎక్క‌డా వినిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఊహించ‌ని అవవ‌కాశం:

మరికొన్ని నెల‌లు ఇదే కొన‌సాగితే మీనాక్షి ఔట్ డేట్ అయిపోతుందా? అన్న సందేహం రాక‌మాన‌దు. స‌రిగ్గా ఇదే స‌మయంలో మీనాక్షి చౌద‌రికి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించింది. టాలీవుడ్ లో స్పీడ్ త‌గ్గినా బాలీవుడ్ ఉందం టూ స‌రైన స‌మ‌యంలో బిగ్ ఛాన్స్ అందుకుంది. బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ `ఫోర్స్` నుంచి థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కు రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. జాన్ అబ్ర‌హాం హీరోగా ఈ సినిమా ప‌నులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా మీనాక్షీ చౌద‌రిని ఎంపిక చేసారు.

ఇండ‌స్ట్రీ కొత్తేం కాదు:

ఇప్ప‌టికే టీమ్ మీనాక్షి తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం క‌థ న‌చ్చ‌డంతో అమ్మ‌డు అంగీక‌రించ‌డం జ‌రిగిపోయింది. దీంతో మీనాక్షి ఆనందానికి అవ‌దుల్లేవ్. ఇంత వ‌ర‌కూ సొగ‌స‌రి బాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అవ్వ లేదు. టాలీవుడ్ టార్గెట్ గానే సినిమాలు చేసుకుంటూ వ‌చ్చింది. బిజీ అయ్యేంత‌గా అవ‌కాశాలు వ‌స్తే హిందీని కాద‌ని ఇక్క‌డే ప‌ని చేసేది. కానీ ఛాన్సులు రాక‌పోవ‌డం మీనాక్షి కొత్త ప్ర‌య‌త్నాలు చేసి బాలీవుడ్ పై దృష్టి పెట్టిన‌ట్లు తాజా క‌మిట్ మెంట్ ని బ‌ట్టి తెలుస్తోంది. అయితే హిందీ ప‌రిశ్ర‌మ‌కు అమ్మ‌డికి కొత్తేం కాదు.

అక్క‌డ లైట్ తీసుకుని టాలీవుడ్ కి:

కెరీర్ ఆరంభంలో `అప్ స్టేర్స్` అనే చిత్రంలో అన్ క్రెడిట్ రోల్ చేసింది. ఆ సినిమా గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. అందులో మీనాక్షి వీరూస్ గాళ్ ప్రెండ్ పాత్ర పోషించింది. కానీ ఆ త‌ర్వాత హిందీ ప‌రిశ్ర‌మ‌ను అంత‌ సీరియ‌గా తీసుకుని అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించ‌లేదు. అనంత‌రం రెండేళ్ల పాటు ఖాళీగానే ఉంది. అటుపై సుశాంత్ హీరోగా న‌టించిన `ఇచ‌ట వాహ‌న‌ములు నిలుపరాదు` చిత్రంలో అవ‌కాశం అందుకుంది. ఆ సినిమా విజ‌యంతో మీనాక్షికి మంచి పేరొచ్చింది. ఆ సినిమా రిలీజ్ కు ముందు త్రివిక్ర‌మ్ ఆమె ప్ర‌తిభ‌ను గుర్తించి మంచి న‌టిగా ఎదుగుతుంద‌ని ప్రోత్స‌హించిన సంగ‌తి తెలిసిందే.