హ్యాట్రిక్ కి ఒక్క అడుగు దూరంలో!
అందాల మీనాక్షి చౌదరి మంచి విజయంతో కొత్త ఏడాదిలోకి గ్రాండ్ గా అడుగు పెట్టింది.
By: Srikanth Kontham | 19 Jan 2026 12:00 PM ISTఅందాల మీనాక్షి చౌదరి మంచి విజయంతో కొత్త ఏడాదిలోకి గ్రాండ్ గా అడుగు పెట్టింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన `అనగనగా ఒక రాజు` తో డీసెంట్ హిట్ అందుకుంది. ఇందులో మీనాక్షి పాత్రకు మంచి పేరొచ్చింది.
మరి ఈ విజయంతో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి. గత ఏడాది సంక్రాంతికి కూడా అమ్మడు `సంక్రాంతికి వస్తున్నాం`తో భారీ విజయాన్నే అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల వసూళ్లనే సాధించింది. కానీ ఆ తర్వాత నటిగా మాత్రం బిజీ కాలేకపోయింది. అక్కడో కారణం ఉంది.
హీరోయిన్ పరంగా ఆ సినిమా క్రెడిట్ అంతా ఐశ్వర్యా రాజేష్ కొట్టేసింది. కానీ ఆ సక్సెస్ తో ఐశ్వర్య కూడా బిజీ కాలేదు. మరి తాజా సక్సెస్ తోనైనా మీనాక్షి బిజీ అవుతుందా? అన్నది చూడాలి. కానీ లైనప్ పరంగా చూస్తే? మీనాక్షి చౌదరి హ్యాట్రిక్ విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. `సంక్రాంతికి వస్తున్నాం`, `అనగనగా ఒక రాజు`తో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకుంది. అమ్మడి ఖాతాలో మరో విజయం పడితే హ్యాట్రిక్ నమోదైనట్లే. అందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తోన్న మిస్టికల్ థ్రిల్లర్ `వృషకర్మ`లో హీరోయిన్ గా నటిస్తోంది.
కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `విరూపాక్ష`తో ప్లాప్ ల్లో ఉన్న సాయితేజ్ కు సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడతను. `విరూపాక్ష` బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను సాధించింది.ఆ తర్వాత మరే సినిమా డైరెక్ట్ చేయకుండా `వృషకర్మ`పైనే పని చేసాడు. ఈ సినిమా ను కూడా కార్తీక్ చెక్కుతున్నాడు. చైతన్యకు బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసితో పనిచేస్తున్నాడు. ఇందులో నాగచైతన్య సాహసకుడి పాత్రలో కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి పాత్రకు అంతే ప్రాధాన్యత ఉంది. దీంతో ఈ సినిమా విజయం సాధిస్తే? మీనాక్షి ఖాతాలో హ్యాట్రిక్ నమోదవుతుంది.
మీనాక్షి బ్యూటీ రేసులో వెనుకబడటానికి ప్రధాన కారణం ఒకటుంది. అమ్మడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుం ది. పెదవి ముద్దులు..ఇంటిమేట్ సీన్స్ అంటే నో చెబుతుంది. డీసెంట్ రోల్స్ మినహా ప్రయోగాలకు వెనుకా డుతుంది. కానీ ఉన్న కాంపిటీషన్ లో వెనక్కి తగ్గితే అవకాశాలు అందుకోవడం కష్టం అని తెలిసినా? ఛాన్స్ తీసు కోవడం లేదు. మరి కొత్త ఏడాది ఏమైనా కొత్తగా ఆలోచిస్తుందేమో చూడాలి.
