Begin typing your search above and press return to search.

త‌న‌ కంటే 30 ఏళ్ల చిన్న వ‌య‌సున్న హీరోయిన్‌ తో స్టార్ హీరో

అక్షయ్ కుమార్ తనకంటే చాలా తక్కువ వయసున్న హీరోయిన్లతో నటించడం బాలీవుడ్‌లో ఎప్పుడూ చర్చనీయాంశమే.

By:  Sivaji Kontham   |   25 Feb 2026 10:47 AM IST
త‌న‌ కంటే 30 ఏళ్ల చిన్న వ‌య‌సున్న హీరోయిన్‌ తో స్టార్ హీరో
X

అక్షయ్ కుమార్ తనకంటే చాలా తక్కువ వయసున్న హీరోయిన్లతో నటించడం బాలీవుడ్‌లో ఎప్పుడూ చర్చనీయాంశమే. గతంలో అక్షయ్ త‌న‌కంటే చిన్న వ‌య‌సు హీరోయిన్లు మానుషి చిల్లర్ (పృథ్వీరాజ్), మౌనీ రాయ్ (గోల్డ్) ల‌తో క‌లిసి న‌టించాడు. గతంలో అక్షయ్-మానుషి చిల్లర్ (పృథ్వీరాజ్), అక్షయ్-మౌనీ రాయ్ (గోల్డ్) మధ్య కెమిస్ట్రీ అంతగా పండలేదని విమర్శలు వచ్చాయి. మీనాక్షి విషయంలో కూడా అదే జరిగితే అది ఆమె కెరీర్‌కు మైనస్ అవుతుంది. ఇప్పుడు `భాగం భాగ్ 2` కోసం మీనాక్షి చౌదరి, ఆయేషా ఖాన్‌లను ఎంపిక చేయడం కూడా అదే కోవలోకి వస్తుంది.

మీనాక్షి చౌదరికి ఇది ప్లస్సా లేదా మైనస్సా? అనేది విశ్లేషిస్తే.. త‌న‌కు కొన్ని ప్ల‌స్ పాయింట్స్ ఉన్నాయి. పెద్ద బ్యానర్, భారీ ప్రాజెక్ట్ లో అరుదైన అవ‌కాశ‌మిది. భాగం భాగ్ ఒక హిట్ ఫ్రాంచైజీ. ఇలాంటి పెద్ద సినిమాలో నటించడం వల్ల మీనాక్షికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వస్తుంది.

అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో పక్కన నటించడం వల్ల సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ హీరోయిన్‌కు కూడా దక్కుతుంది. ఇది ఆమె కెరీర్‌కు మైలేజీ ఇస్తుంది. తెలుగులో ఇప్పటికే స్టార్ హీరో మహేశ్ బాబు, యువ‌హీరోలు వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ ల‌తో మీనాక్షి న‌టించింది. ర‌వితేజ లాంటి పెద్ద స్టార్ తోను ఆడిపాడింది. అందుకే ఇప్పుడు త‌న సీనియారిటీకి ముంబైలో గౌర‌వం ద‌క్కుతుంది.

కొన్ని మైన‌స్ లు లేక‌పోలేదు. వయసు వ్యత్యాసంపై విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.* అక్షయ్ కుమార్ (58) - మీనాక్షి చౌదరి (28) మధ్య దాదాపు 30 ఏళ్ల వయసు తేడా ఉంది. సోషల్ మీడియాలో దీనిపై వచ్చే నెగటివ్ కామెంట్స్ హీరోయిన్ ఇమేజ్‌పై ప్రభావం చూపవచ్చు. అక్షయ్ కుమార్ సినిమాల్లో ..ముఖ్యంగా కామెడీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కేవలం పాటలకు, కొన్ని సీన్లకే పరిమితం అవుతుంటాయి. నటనకు ప్రాధాన్యత లేకపోతే ఆమెకు పెద్దగా పేరు రాకపోవచ్చు.

అయితే బాలీవుడ్ మార్కెట్ పెద్దది. సినిమా ఫలితం తో పాటు త‌న‌ పాత్రపైనే అంతా ఆధారపడి ఉంటుంది. గోల్డ్ చిత్రంలో అత‌డి స‌ర‌స‌న న‌టించిన మౌనిరాయ్ ప్ర‌తిభ కార‌ణంగా ఎదుగుతోంది. కానీ పృథ్వీరాజ్ లాంటి పెద్ద సినిమాలో న‌టించినా కానీ, మానుషి చిల్ల‌ర్ ను దుర‌దృష్టం వెంటాడుతోంది. కానీ ఆ ఇద్ద‌రి మించి మీనాక్షి నిరూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న మీనాక్షి.. ఈ సినిమాతో హిందీలో కూడా పాగా వేస్తుందేమో చూడాలి. దీనికోసం మంచి హిట్లు ప‌డాలి.