49 ఏళ్ల మీనా రెండవ పెళ్లి గురించి ఏమంటున్నారు?
అప్పటి నుంచి పాపే ప్రాణంగా జీవిస్తున్నారు. ఈ దశలో కూడా మీనా సినిమాలకు దూరమవ్వలేదు. బాధనంతా పంటికిందే దిగమింగి అభిమానుల్ని అలరిస్తున్నారు.
By: Srikanth Kontham | 23 Nov 2025 11:46 AM ISTవెటరన్ నటి అందాల మీనా గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి. సౌత్ లో అన్ని భాషల్లోనూ సత్తా చాటారు. ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేసారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసారు. నటిగా కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి 2025వరకూ పని చేస్తూనే ఉన్నారు. వివాహం చేసుకున్నా? వృత్తిని మాత్రం వదల్లేదు. కుటుంబం..సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ ని ముందుకు సాగించారు. భర్త...పాపతో సంతోషంగా సాగిపోతున్న జీవితంలో భర్త మరణంతో అంతా తల్లకిందులైంది.
అప్పటి నుంచి పాపే ప్రాణంగా జీవిస్తున్నారు. ఈ దశలో కూడా మీనా సినిమాలకు దూరమవ్వలేదు. బాధనంతా పంటికిందే దిగమింగి అభిమానుల్ని అలరిస్తున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ వచ్చిన అవకాశాలతో బిజీగా ఉన్నారు. అయితే భర్త మరణానంతరం మీనా రెండవ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతోంది. వాటిని ఏనాడు మీనా కూడా ఖండించలేదు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగతం ఎలా ఉంది? ఆరోగ్యానికి సంబంధిం చిన విషయాలపై మాత్రమే ఓపెన్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి ప్రచారం పీక్స్ కు చేరడంతో? వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
`ప్రస్తుతం పాపతో సంతోషంగా ఉన్నాను. పెళ్లి గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. ఏ హీరో విడాకులు తీసుకున్నా? అతడితో నా పెళ్లి అంటూ రాస్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలు. వాటిలో ఎలాంటి నిజాలు లేవన్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయ`న్నారు. పాప పుట్టిన రెండేళ్లకే మలయాళం సినిమా దృశ్యం కోసం సంప్రదించారు. కానీ అప్పుడు వీలుకాకపోవడంతో నో చెప్పానన్నారు. కానీ కథ నచ్చడంతో కొన్ని రోజుల తర్వాత ఒకే చెప్పానన్నారు. ఇప్పుడు కూడా మంచి కథలు, వాటిలో పాత్ర విషయం పూర్తి సంతృప్తిగా ఉంటేనే నటించడానికి అంగీకరిస్తున్నాను. లేదంటే? నో చెబుతున్నానన్నారు.
తాను నటిగా మరిన్ని మెరుగైన పాత్రలు పోషించడానికి మాత్రమే సిద్దంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం మీనా మల యాళం వెర్షన్ `దృశ్యం 3` లో నటిస్తున్నారు. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. అలాగే తమిళ్ లో `మూకుత్తి అమ్మన్ 2` తో పాటు, `రౌడీ బేబి`లోనూ నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ దృశ్యంలోనూ మీనా నటించిన సంగతి తెలిసిందే. `దృశ్యం 3` లో కూడా ఆమె నటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మీనా వయసు 49 ఏళ్లు.
