సంచలన భర్త పాత్రలో సౌత్ నటుడా?
అందాల తార మీనా కుమారి బయోపిక్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. మీనా కుమారి పాత్రలో కియారా అద్వాణి నటిస్తుంది.
By: Srikanth Kontham | 5 Nov 2025 8:15 AM ISTఅందాల తార మీనా కుమారి బయోపిక్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. మీనా కుమారి పాత్రలో కియారా అద్వాణి నటిస్తుంది. సిద్దార్ద్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చాయి. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇదే బయోపిక్ లో మీనా కుమారి భర్త, నిర్మాత కమల్ ఆమ్రోహీ పాత్రపై సస్పెన్స్ నెలకొంది. ఈ పాత్ర సినిమాలో అత్యంత కీలకమైంది. మీనా కుమారి జీవితం ప్రేమ , పెళ్లితోనే కోల్పోయిందన్నది కాదనలేని నిజం.
కానీ జీవితాంతం కమల్ ఆమ్రోహీ ప్రేమ కోసమే పోరాడింది. తనకంటే పెద్దవాడైన చిత్ర నిర్మాత కమల్ అమ్రోహిని వివాహం చేసుకుంది. ఇద్దరి పరిచయం ఎంతో విచిత్రంగా జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మీనా కుమారికి వారంతాల్లో సపర్యాలు చేస్తూ కమల్ స్నేహాన్ని పెంచుకున్నారు. అటుపై రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ వివాహమే మీనా జీవితాన్ని మార్చేసింది. పెళ్లి అనంతరం కమల్ ఆమె చుట్టూ ఉచ్చు బిగించాడు. నటి కావడంతో కమల్ అనుక్షణం అభద్రతా భావంతో ఉండేవారు. కలిసి ఉన్నంత కాలం ఆ కాపురం కండీషన్ల ప్రకారమే సాగింది.
భర్త కండీషన్లతో మీనా కుమారి ఉక్కిరి బిక్కిరి అయింది. ఓ వైపు సినిమాలు..మరోవైపు కండీషన్లతో ఎంతో కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది. `పాకీజా` రిలీజ్ అనంతరం విడాకులు ఇచ్చేసాడు కమల్. దీంతో మీనా కుమారి మద్యానికి బానిస అయ్యారు. అదే సమయంలో మీనా కుమారికి ధర్మేంద్ర దగ్గరయ్యారు. కొన్ని రోజులకు అతడు దూరమయ్యాడు. అలా మీనా జీవితంతో ధర్మేంద్ర కూడా కీలక వ్యక్తే. ఈ నేపథ్యంలో అలాంటి సంచలన పాత్రలలో నటించడానికి సిద్దార్ద్ బాలీవుడ్ లో చాలా మంది యువ నటుల్ని పరిశీలించారు. అచ్చంగా కమల్, పోలికలు ఉన్న నటుల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటి వరకూ పరిశీలించిన బాలీవుడ్ నటులెవరు? ప్రత్యేకించి కమల్ ఆహార్యానికి దగ్గరగా లేకపోవడంతో తాజాగా సిద్దార్త్ మల్హోత్రా దక్షిణాది నటుల వైపు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలుగు, తమిళ నుంచి ఆ పాత్రకు సూటయ్యే నటుడు ఎవరైనా సెట్ అవుతారా? అని సంప్రదింపులు మొదలు పెట్టారుట. ఈ పాత్రలో నటించే అవకాశం ఏ నటుడికి దక్కతుందో గానీ? ఆ పాత్రతో ఫేమస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
