Begin typing your search above and press return to search.

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

సీనియర్ నటుడు శ్రీకాంత్, ఊహ కుమార్తె మేధా మేక హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మైత్రి ఇన్ లవ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా బ్లాక్ చుడీదార్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె లుక్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

By:  Madhu Reddy   |   9 Nov 2026 1:47 PM IST
కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!
X

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి సెలబ్రిటీల వారసుల రాక వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేస్తోంది.. అటు నూతన నటీనటులతో పాటు ఇటు సెలబ్రిటీల వారసుల మధ్య పోటీ గట్టిగా సాగుతోంది. నువ్వా నేనా అనే రేంజ్ లో తమ అద్భుతమైన నటనతో, అత్యద్భుతమైన కథల ఎంపికలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కథ కంటెంట్ బాగుంటే స్టార్డంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో యువ నటీనటులు కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలోకి కొంతమంది సెలబ్రిటీల వారసులు అడుగుపెట్టి సత్తా చాటుతుండగా ఇప్పుడు మరో సెలబ్రిటీ కిడ్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది.

ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటుడు శ్రీకాంత్, సీనియర్ హీరోయిన్ ఊహ దంపతుల కుమార్తె మేధా మేక. యువతను లక్ష్యంగా చేసుకుంటూ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'మైత్రి ఇన్ లవ్' అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతోంది మేధా.. సహాయ దర్శకుడిగా తన కెరియర్ను మొదలుపెట్టి, హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న జై జస్తి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అలాగే పృథ్వీ వనం నూతన దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీతా రచయిత రామ జోగయ్య శాస్త్రి తనయుడు సాయి హర్ష ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలలో కనిపించి, తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు మిగతా హీరోయిన్ల లాగే తాను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది .ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. రాత్రి వేళల్లో దీపావళి సందర్భంగా బ్లాక్ చుడీదార్ లో చాలా సింపుల్ లుక్ లో కనిపించి అభిమానుల హృదయాలను దోచుకుంది.

ఎక్కువ మేకప్ కి చోటు ఇవ్వకుండా సింపుల్ మేకప్ తో ట్రెడిషనల్ గా కనిపించి అభిమానుల హృదయాలను దోచుకుంది మేధా. మొత్తానికైతే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో.. ఆకట్టుకునే కళ్ళతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. శ్రీకాంత్ కూతురు ఇప్పుడు జెన్జీ యువతకు క్రష్ గా మారింది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే మేధా షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు ."మేధా నిన్ను చూస్తుంటే వస్తోంది గుండెల్లో అందమైన బాధ" ఒక అభిమాని పంచుకోగా.. మరొకరు "హై వోల్టేజ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా నిన్ను చూస్తే ఆగిపోతాయి" అంటూ కవిత్వాలు వల్లిస్తున్నారు. ఇంకొంతమంది క్యూట్ అంటూ, మా బంగారం అంటూ ఇలా రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.