Begin typing your search above and press return to search.

మయసభ ట్రైలర్.. రైజ్ ఆఫ్ ది టైటిన్స్..!

స్నేహితులుగా ఉన్న ఇద్దరు లీడర్స్ మధ్య మొదలైన రాజకీయ ఆట ఎలా మారింది అన్నదే ఈ మయసభ కథ. ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

By:  Ramesh Boddu   |   31 July 2025 4:38 PM IST
మయసభ ట్రైలర్.. రైజ్ ఆఫ్ ది టైటిన్స్..!
X

టాలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ దేవా కట్ట నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా మయసభ. ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. సోనీ లివ్ లో ఈ సినిమా ఆగష్టు 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. స్నేహితులుగా ఉన్న ఇద్దరు లీడర్స్ మధ్య మొదలైన రాజకీయ ఆట ఎలా మారింది అన్నదే ఈ మయసభ కథ. ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

మయసభ గట్టిగా సౌండ్ చేసేలా..

ఆమధ్య వచ్చిన టీజర్ తోనే మయసభ ఇదేదో గట్టిగా సౌండ్ చేసేలా ఉందనిపించింది. ఇక ఆ అంచనాలను ఇంకాస్త పెంచుతూ మయసభ ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ చూస్తే ఇంకాస్త డీటైల్స్ ఇచ్చాడు డైరెక్టర్ దేవా కట్ట. ఇద్దరు స్నేహితులు రాజకీయ శత్రువులుగా ఎలా మారారు అన్న కథతో ఈ మయసభ సినిమా వస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి వస్తుంది.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వచ్చాడు. దేవా కట్టతో రిపబ్లిక్ షూటింగ్ టైం విషయాలను పంచుకున్నారు తేజ్. దేవా కట్ట వర్కింగ్ స్టైల్ గురించి శ్రీకాంత్ అయ్యంగార్ ఐతే టార్చర్ గురించి చెప్పాడు. మయసభ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీని ఓటీటీ రిలీజ్ ఎందుకు చేస్తున్నారో కానీ థియేట్రికల్ స్టఫ్ ఉన్న స్టోరీగా ఉంది.

రియల్ లీడర్స్ ని పోలి ఉన్నట్టుగా..

ఆది పినిశెట్టి, చైతన్య రావు ఇద్దరికీ మంచి పవర్ ఫుల్ రోల్స్ పడ్డాయి. దేవా కట్ట్ స్టోరీ టెల్లింగ్ గురించి తెలిసిందే. ప్రస్థానం సినిమా ఇప్పటికీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఆ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు బాగున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రియల్ లీడర్స్ ని పోలి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఐతే తప్పకుండా ఈ మూవీ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అర్దమవుతుంది. దేవా కట్ట నుంచి ఆఫ్టర్ గ్యాప్ వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై మంచి బజ్ ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఆయన చేసే సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. సో మయసభ ఎలా ఉంటుందో చూడాలి.