Begin typing your search above and press return to search.

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

ట్రైలర్ ఆరంభంలోనే హీరో క్రిష్ తానెవరిని ఇష్టపడ్డాడో అర్థం కావడం లేదంటూ కొండపై కూర్చుని చెప్పే డైలాగ్‌తో కథలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ను పరిచయం చేశారు.

By:  M Prashanth   |   4 Nov 2026 4:25 PM IST
మాయ లేడీ ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్
X

టాలీవుడ్‌లో కాన్సెప్ట్ బేస్డ్ రొమాంటిక్ కామెడీ సినిమాలకు ఎప్పుడూ కూడా స్పెషల్ ఆడియన్స్ ఉంటారు. గతంలో 'ఎవరికీ చెప్పొద్దు' లాంటి డీసెంట్ ఎంటర్‌టైనర్ అందించిన క్రేజీ యాంట్స్ సంస్థ నుంచి వస్తున్న కొత్త చిత్రం 'మాయ లేడీ'. రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. ఫన్నీ ఎలిమెంట్స్, గందరగోళ ప్రేమకథతో ట్రైలర్ కట్ ఆసక్తికరంగా సాగింది. రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా యూత్‌ను ఆకట్టుకునే అంశాలను ఇందులో చూపించారు.

ట్రైలర్ ఆరంభంలోనే హీరో క్రిష్ తానెవరిని ఇష్టపడ్డాడో అర్థం కావడం లేదంటూ కొండపై కూర్చుని చెప్పే డైలాగ్‌తో కథలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ను పరిచయం చేశారు. రూప, ఆశ అనే కవల పిల్లల మధ్యలో ఇరుక్కుని అతగాడు పడే పాట్లు కథకు బలంగా కనిపిస్తున్నాయి. ఒకరితో ప్రేమలో పడ్డానని అనుకుంటూ మరొకరితో కనెక్ట్ అవ్వడం, ఇద్దరి స్వభావాలు వేరుగా ఉండటం మంచి ఫన్ డ్రైవ్ చేస్తోంది. హీరోయిన్ మధుమిత సర్కార్ రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో చక్కగా ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది.

హీరోయిన్ లాస్ట్ అండ్ ఫౌండ్ సంస్థ కాన్సెప్ట్ ఈ కథకు మరో కొత్త కోణాన్ని జోడించింది. డబ్బు, బంగారం వంటి ఖరీదైన వస్తువులు పోతే పోలీసుల దగ్గరకు వెళ్తారు, కానీ వెలకట్టలేని వాటి కోసం తన దగ్గరకు వస్తారని చెప్పే లాజిక్ ఆలోచింపజేసేలా ఉంది. ఈ కాన్సెప్ట్ ప్రధాన ప్రేమకథతో ఎలా ముడిపడి ఉందనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. కేవలం టైమ్‌పాస్ రొమాన్స్ మాత్రమే కాకుండా, కథలో ఓ ఎమోషనల్ లేయర్ కూడా దాగి ఉందనే హింట్ ఇచ్చారు.

ఈ చిత్రానికి కమెడియన్ సత్య మరో పాజిటివ్ అయ్యేలా ఉన్నాడు. హీరో స్నేహితుడిగా కనిపించే సత్య, ప్రేమ వ్యవహారాలపై ఇచ్చే ఫన్నీ సలహాలు కామెడీగా ఉన్నాయి. రింగ్ మార్చుకోమని చెప్పే సీన్, డైనింగ్ టేబుల్ వద్ద గందరగోళం ట్రైలర్‌లో మంచి రిలీఫ్ ఇచ్చాయి. ఇంద్రజ, సురేష్ పాత్రలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. డైలాగుల్లో సహజమైన వినోదం చక్కగా పండింది.

టెక్నికల్ పరంగా చూస్తే విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం రొమాంటిక్ సన్నివేశాలకు మంచి ఫీల్ తీసుకొచ్చింది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగాయి. దర్శకుడు ప్రశాంకర్ ఎక్కడా ఓవర్‌దటాప్ డ్రామా లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తీర్చిదిద్దినట్లు అనిపిస్తోంది. ఎడిటింగ్ ఫ్లో కూడా యూత్‌ఫుల్ వైబ్‌ను బాగా మెయింటైన్ చేసింది. ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా బడ్జెట్‌కు తగినట్లు నీట్‌గా కుదిరాయి. ఇక మాయ లేడీ ట్రైలర్ సరదా రొమాంటిక్ కన్ఫ్యూజన్‌తో డీసెంట్ పాజిటివ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేసింది. నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.