సన్నీ లియోన్ షో... కృష్ణుడి జన్మభూమి వివాదం
మధురలోని ఆ స్టార్ హోటల్ యాజమాన్యం కేవలం 300 మంది ఆడియన్స్‌తో ఈ పార్టీ ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది.
By: Ramesh Palla | 30 Dec 2025 3:54 PM ISTఇండియన్ సినీ ప్రేక్షకుల్లో సన్నీ లియోన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. కానీ గత దశాబ్ద కాలంగా పూర్తిగా ఇండియన్ సినిమాలకు పరిమితం అయింది. ఆమె సినిమాల్లో చేసే పాత్రలు, చేసే డాన్స్‌ల కారణంగా కొందరు ఆమెను ఒకరకంగా అనుకుంటే ఆమె వ్యక్తిగతం మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఆమె మంచి మనసున్న వ్యక్తి అని చాలా సార్లు నిరూపితం అయ్యింది. హీరోయిన్‌గా సన్నీ లియోన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఎక్కువ లేవు. కానీ ఆమె ఎప్పటికప్పుడు స్టేజ్ షో లు చేయడం ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమెతో న్యూ ఇయర్ పార్టీలను ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున సంస్థలు ముందుకు వస్తూ ఉంటాయి. ఈసారి ఈమె న్యూ ఇయర్ పార్టీ మధురలో ప్లాన్ చేశారు. భారీ ఎత్తున ఈమెకు పారితోషికం ఇచ్చి మరీ ఒక హోటల్ యాజమాన్యం వారు ఈమెను హైర్ చేసుకున్నారు.
సన్నీ లియోన్ డాన్స్ షో కి ఏర్పాట్లు...
మధురలోని ఆ స్టార్ హోటల్ యాజమాన్యం కేవలం 300 మంది ఆడియన్స్‌తో ఈ పార్టీ ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. రేంజ్ కి తగ్గట్లుగా టికెట్ల రేట్లను నిర్ణయించారు. ఇప్పటికే బుకింగ్ కూడా క్లోజ్ అయింది. ఇలాంటి సమయంలో సన్నీ లియోన్ కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లుగా హోటల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మధురలో సన్నీ లియోన్ కార్యక్రమంను రద్దు చేయడం వెనుక సాధువులు ఉన్నారని, పెద్ద ఎత్తున హిందూ సంఘాల వారి ఆందోళన పని చేసిందని తెలుస్తోంది. సన్నీ లియోన్ ను పూర్తి అనుమతులతో తీసుకు వచ్చేందుకు హోటల్ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. అయినా కూడా ఎందుకు చివరి నిమిషంలో కార్యక్రమాలు రద్దు చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మధురలో న్యూ ఇయర్ పార్టీ రద్దు..
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... సన్నీ లియోన్ వంటి శృంగార తార తో హిందువులు పవిత్రంగా భావించే మధురలో డాన్స్ కార్యక్రమం చేయించడం ఏమాత్రం కరెక్ట్ కాదని హిందూ సంఘాల వారు అంటున్నారు. పలువురు సాధువులు, హిందూ సంఘాల నాయకులు స్థానిక కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాదు కూడదు అని కార్యక్రమంను నిర్వహించే ప్రయత్నం చేస్తే జరిగే పరిణామాలకు తమను బాధ్యులు చేయకూడదు అంటూ హిందూ సంఘాల వారు, సాధువులు హెచ్చరించారట. దాంతో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవడంతో పాటు, హోటల్ యాజమాన్యంకు నోటీసులు ఇచ్చి కార్యక్రమంను అడ్డుకున్నారని తెలుస్తోంది. శ్రీకృష్ణుడి జన్మ భూమి గా మధురను హిందువులు భావిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన స్థలంలో సన్నీ లియోన్ వంటి తారలతో అశ్లీల నృత్యాలు చేయించడం అనేది హిందూ ధర్మం ను అవమానించడం అవుతుందని అంతా భావించారు.
సన్నీ లియోన్ ఫ్యాన్స్ అసంతృప్తి...
ఈ విషయమై హోటల్ యాజమాన్యం సైతం సానుకూలంగా స్పందించింది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశం తమకు లేదని, సన్నీ లియోన్ ను ఒక సాధారణ నటిగానే తాము పార్టీకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాము. ఆమె విషయంలో వ్యతిరేకత వస్తే కచ్చితంగా అందరి మనోభావాలను గౌరవించే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా యాజమాన్యం కొత్త సంవత్సరం పార్టీ విషయంలో తాము తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. మరో వైపు సన్నీ లియోన్ అభిమానులు, ముఖ్యంగా ఆ పార్టీకి వెళ్లాలి అనుకున్న వారు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సన్నీ లియోన్ ను ఇతర బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ మాదిరిగా ఎందుకు చూడరు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
