Begin typing your search above and press return to search.

స్టార్స్‌ను హ్యాండిల్ చేయడమే అసలు ఛాలెంజ్.. డైరెక్టర్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు!

ముఖ్యంగా ఒకేసారి పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించే మల్టీస్టారర్ సినిమాల్లో షూటింగ్ నిర్వహణ, షెడ్యూల్ ప్లానింగ్, నటీనటుల సమన్వయం వంటి అంశాలు మేక‌ర్స్ కు పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 Jun 2026 8:00 PM IST
స్టార్స్‌ను హ్యాండిల్ చేయడమే అసలు ఛాలెంజ్.. డైరెక్టర్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు!
X

భారీ తారాగణంతో సినిమాలు రూపొందించడం ప్రేక్షకులకు ఎంత ఇంట్రెస్టింగ్ గా కనిపించినా, వాటిని తెరపైకి తీసుకురావడం డైరెక్ట‌ర్ కు మాత్రం అసలు పరీక్షగా మారుతుంది. ముఖ్యంగా ఒకేసారి పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించే మల్టీస్టారర్ సినిమాల్లో షూటింగ్ నిర్వహణ, షెడ్యూల్ ప్లానింగ్, నటీనటుల సమన్వయం వంటి అంశాలు మేక‌ర్స్ కు పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి. ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చూపించింది వెల్‌కమ్ టు ది జంగిల్ సినిమా. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అహ్మద్ ఖాన్ తాజాగా సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, ఇంత భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం వెనుక ఎంతటి కసరత్తు జరిగిందో వివరించారు. ఆడియ‌న్స్ చివరకు రెండు నుంచి మూడు గంటల ఎంట‌ర్టైన్‌మెంట్ ను మాత్రమే చూస్తారు. కానీ ఆ రిజ‌ల్ట్ వెనుక నెలల తరబడి జరిగిన ప్లానింగ్, సమన్వయం, ప్రెజ‌ర్ దాగి ఉంటుందని ఆయన కామెంట్స్ సూచిస్తున్నాయి.

ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది దాని భారీ క్యాస్టింగ్. ఒకే సినిమాలో 34 మంది ప్రముఖ నటీనటులు కనిపించడం బాలీవుడ్‌లో అరుదుగా కనిపించే విషయంగా మారింది. ఇంతమంది కళాకారులను ఒకే షెడ్యూల్‌లో తీసుకురావడం, వారికి తగిన ప్రాధాన్యం కల్పించడం, సీన్స్ క్రియేట్ చేయడం వంటి అంశాలు సాధారణ సినిమాలతో పోలిస్తే ఎన్నో రెట్లు క్లిష్టంగా మారాయని తెలుస్తోంది. కేవలం నటీనటులతోనే అయిపోలేదు. ఒక్కో స్టార్‌తో పాటు వారి ప‌ర్స‌న‌ల్ స్టాఫ్, మేకప్ టీమ్స్, కాస్ట్యూమ్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు, స్టంట్ విభాగం, డ్యాన్సర్లు, ఇతర సిబ్బంది కలిపి రోజూ వందలాది మంది షూటింగ్‌లో పాల్గొనేవార‌ట‌. ఒక దశలో సెట్స్‌పై 900 కూడా ఉండేవార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి విభాగం టైమ్ కు రెడీగా ఉండేలా చూడటం డైరెక్ట‌ర్, ప్రొడ‌క్ష‌న్ టీమ్ కు పెద్ద బాధ్యతగా మారింద‌ని ఆయ‌న చెప్తున్నారు.

అహ్మద్ ఖాన్ చెప్పిన మరో ఇంట్రెస్టింగ్ అంశం షెడ్యూల్ సమన్వయం. ప్రతి స్టార్‌కు వేర్వేరు డేట్స్ ఉండటంతో, అందరికీ అనుకూలంగా షూటింగ్ ప్లాన్ చేయడం ఎంతో కష్టసాధ్యమైందని ఆయన వెల్లడించారు. ఒకే సీన్ కు అవసరమైన నటీనటులు అందుబాటులో ఉండే రోజులను గుర్తించి, వాటికి అనుగుణంగా షూటింగ్ చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో దర్శకత్వ ప్రతిభ కేవలం సీన్స్ ను తెరకెక్కించడంలోనే కాదని, అందరినీ ఒకే టార్గెట్ తో ముందుకు నడిపించడంలో కూడా కనిపిస్తుందని ఈ అనుభవాలు చెబుతున్నాయి.

సెట్స్ వెనుక జరిగిన ఏర్పాట్లు కూడా ఈ సినిమా స్థాయిని ప్రతిబింబిస్తున్నాయి. వందలాది మంది టీమ్ కు అవసరమైన షెల్ట‌ర్, ట్రావెలింగ్, పార్కింగ్, షూటింగ్ నిర్వహణ వంటి అంశాల కోసం ప్రత్యేక ప్లాన్ అమలు చేసినట్లు తెలుస్తోంది. ఆడియ‌న్స్ కు తెరపై కనిపించే కొన్ని నిమిషాల సీన్స్ వెనుక ఎన్నో గంటల సమన్వయం, వందలాది మంది కృషి దాగి ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తోంది. మొత్తంగా చూస్తే, వెల్‌కమ్ టు ది జంగిల్ కేవలం మరో కామెడీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు. భారీ మల్టీస్టారర్ సినిమాను రూపొందించడం వెనుక డైరెక్ట‌ర్, చిత్ర బృందం ఎంతటి ఒత్తిడి, ప్రణాళిక, నిర్వహణ నైపుణ్యంతో పనిచేయాల్సి వస్తుందో చూపించే ఉదాహరణగా కూడా నిలుస్తోంది. ఆడియ‌న్స్ చూసేది, మాట్లాడుకునేది ఫైనల్ అవుట్‌పుట్ మాత్రమే అయినా, ఆ తెర వెనుక జరిగిన అసలు పోరాటమే ఈ సినిమాకు మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.