Begin typing your search above and press return to search.

మాస్ మహారాజా క్లాస్ స్టెప్పులు.. స్పెయిన్ వీధుల్లో 'బెల్లా' రచ్చ!

మాస్ మహారాజా ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ఆయన కనిపిస్తే చాలు ఆటోమేటిక్ గా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి.

By:  M Prashanth   |   1 Dec 2025 4:55 PM IST
మాస్ మహారాజా క్లాస్ స్టెప్పులు.. స్పెయిన్ వీధుల్లో బెల్లా రచ్చ!
X

మాస్ మహారాజా ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ఆయన కనిపిస్తే చాలు ఆటోమేటిక్ గా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. వరస పెట్టి మాస్, యాక్షన్ సినిమాలు చేసుకుంటూ పోతున్న రవితేజ, ఈసారి రూట్ మార్చారు. చాలా రోజుల తర్వాత తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ ఒక క్లాస్ టచ్ ఉన్న సినిమాతో రాబోతున్నారు. లేటెస్ట్ ఈ సినిమా నుంచి వచ్చిన ఒక సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలర్ ఫుల్ గా మారింది.





రవితేజ సినిమా పాటలు అంటేనే మాస్ బీట్స్, డప్పు సౌండ్లు గుర్తొస్తాయి. కానీ ఈసారి అలా కాకుండా చాలా ట్రెండీగా, స్టైలిష్ గా ప్లాన్ చేశారు. అసలు ఈ మధ్య కాలంలో రవితేజను ఇంత కూల్ గా, ఇంత కలర్ ఫుల్ గా చూడలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఆ లొకేషన్స్, ఆ మేకింగ్ చూస్తుంటే ఈసారి సంక్రాంతికి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీ 'భర్త మహారాజులకు విజ్ఞప్తి'. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'బెల్లా బెల్లా' సాంగ్ ను రాజమండ్రిలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ ట్యూన్ వినగానే ఎక్కేసేలా ఉంది. ముఖ్యంగా స్పెయిన్ అందమైన వీధుల్లో ఈ పాటను చిత్రీకరించిన విధానం కనువిందుగా ఉంది. రవితేజ స్టైలిష్ లుక్స్, ఆయన వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్పులు ఈ పాటకు హైలెట్.

ఈ పాటలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. లిరిక్స్ లో వర్ణించినట్టే ఆమె నిజంగానే ఒక ఏంజెల్ లా మెరిసిపోతోంది. సురేష్ గంగుల రాసిన సాహిత్యం, దానికి నకాష్ అజీజ్, రోహిణి పాడిన విధానం చాలా ఎనర్జిటిక్ గా ఉంది. "బెల్లా బెల్లా.. ఈసా బెల్లా" అంటూ సాగే ఈ పాటలో రవితేజ, ఆషికా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత రవితేజ డ్యాన్స్ లో ఒక కొత్త జోష్, ఈజ్ కనిపిస్తోంది.

ధమాకా తర్వాత భీమ్స్, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మ్యూజిక్ పరంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ ఫస్ట్ సింగిల్ ఉండటం విశేషం. కేవలం పాట మాత్రమే కాదు, ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందట. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా పాటలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పెయిన్ లొకేషన్స్ ను సినిమాటోగ్రాఫర్ చాలా రిచ్ గా చూపించారు. ఇక మాస్ యాక్షన్ సినిమాల మోత నుంచి కాస్త గ్యాప్ ఇచ్చి, ఇలాంటి కూల్ అండ్ క్లాసీ ఎంటర్టైనర్ తో రవితేజ రావడం ఫ్యాన్స్ కు కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తోంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.