చక్రీ AI వాయిస్.. ఆ ఆడియా ఎవరిదంటే..
సినిమాల్లో AI వాడకంపై వస్తున్న విమర్శల గురించి అడిగినప్పుడు, "ప్రతీ టెక్నాలజీలో పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. దాన్ని మనం ఎలా వాడుతున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
By: M Prashanth | 29 Oct 2025 8:51 PM IST'మాస్ జాతర' సినిమాలోని 'తూ మెరా లవర్' పాట రీసెంట్‌గా రిలీజై పెద్ద హిట్టయింది. ఆ పాటలో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే, దివంగత సంగీత దర్శకుడు చక్రి గారి వాయిస్‌ను AI టెక్నాలజీతో రీ క్రియేట్ చేయడం. ఇది ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించినా, AI వాడకంపై కొన్ని డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ విషయంపై డైరెక్టర్ భాను భోగవరపు క్లారిటీ ఇచ్చారు.
"నిజానికి ఆ పాటను మొదట మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారే పాడారు. రిలీజ్‌కు పది రోజుల ముందు, ఈ పాటను చక్రి వాయిస్ తో చేస్తే ఎలా ఉంటుందని అనిపించింది.,AI టెక్నాలజీ వాడుదామని భీమ్స్ గారే ఐడియా ఇచ్చారు" అని భాను భోగవరపు తెలిపారు. AI వెర్షన్ విన్న తర్వాత హీరో రవితేజ, నిర్మాత నాగవంశీ, డైరెక్టర్.. ముగ్గురికీ చాలా బాగా నచ్చిందని, అప్పుడే ఫైనల్ చేశామని చెప్పారు.
అయితే, ఇది AI టెక్నాలజీని మిస్ యూస్ చేయడం కాదని, కేవలం చక్రి గారి జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తీసుకురావడానికే ఈ ప్రయత్నం చేశామని భాను గట్టిగా చెప్పారు. "హీరో రవితేజ గారికి, చక్రి గారికి మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలుసు. వాళ్ల కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సాంగ్స్ వచ్చాయి. ఒకవేళ చక్రి గారు బతికుంటే, ఈ పాట ఆయనే పాడేవారు. ఆ మెమరీని, ఆ ఫీల్‌ను మళ్లీ తీసుకురావాలనే ఈ చిన్న ప్రయత్నం చేశాం తప్ప, టెక్నాలజీని తప్పుగా వాడాలనే ఉద్దేశం మాకు లేదు" అని భాను వివరణ ఇచ్చారు.
సినిమాల్లో AI వాడకంపై వస్తున్న విమర్శల గురించి అడిగినప్పుడు, "ప్రతీ టెక్నాలజీలో పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. దాన్ని మనం ఎలా వాడుతున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు మేం చూసినంతలో, AI వల్ల పెద్దగా నెగెటివ్ జరిగింది లేదు. మేమైతే దీన్ని కేవలం ఒక మంచి జ్ఞాపకం కోసమే వాడాం" అని బదులిచ్చారు.
AI డబ్బింగ్‌ల వల్ల ఒరిజినాలిటీ పోతుందనే వాదనపైనా ఆయన స్పందించారు. "అవును, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. కానీ దాన్ని ప్రాపర్‌గా, అవసరమైన చోట మాత్రమే వాడితే బాగుంటుంది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి, 'తూ మెరా లవర్' పాట విషయంలో తమ ఇంటెన్షన్ చాలా ప్యూర్ అని, అదొక ఒక ట్రిబ్యూట్ లాంటిదని డైరెక్టర్ భాను భోగవరపు క్లియర్ చేశారు.
