Begin typing your search above and press return to search.

'మాస్ జాతర'.. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటీ రాజా?

నిజానికి ఈ సినిమాకు రిలీజ్ డేట్ కష్టాలు కొత్తేమీ కాదు. రవితేజ 75వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు.

By:  M Prashanth   |   25 Oct 2025 9:56 PM IST
మాస్ జాతర.. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటీ రాజా?
X

మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ "మాస్ జాతర" సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అభిమానుల సహనానికి పెద్ద పరీక్షే పెడుతోంది. "అప్పుడు వస్తాం.. ఇప్పుడు వస్తాం" అంటూ మేకర్స్ ఊరిస్తూనే ఉన్నారు తప్ప, ఒక ఫైనల్ డేట్‌కు ఫిక్స్ కాలేకపోతున్నారు. ఎన్నో అడ్డంకులు, వాయిదాలు దాటుకుని, ఫైనల్‌గా అక్టోబర్ 31కి డేట్ లాక్ చేశారనుకుంటే, ఇప్పుడు ఓ రీ రిలీజ్ బజ్ అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.

అవును, మీరు విన్నది కరెక్టే. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో సరికొత్తగా రీ కట్ చేసిన వెర్షన్‌ను అదే అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. 'బాహుబలి' క్రేజ్ గురించి, ఆ ఫ్రాంచైజీకి ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది రీ రిలీజ్ అయినా సరే, ఓపెనింగ్స్ విషయంలో కొత్త సినిమాలకు కూడా గట్టి పోటీ ఇస్తుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు 'మాస్ జాతర' టీమ్‌ను డైలమాలో పడేసింది. ఇంత హైప్ ఉన్న సినిమాతో క్లాష్ పెట్టుకోవడం కరెక్ట్ కాదని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.

నిజానికి ఈ సినిమాకు రిలీజ్ డేట్ కష్టాలు కొత్తేమీ కాదు. రవితేజ 75వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు. మొదట సంక్రాంతి బరిలోనే దించాలనుకున్నారు, కానీ కుదర్లేదు. ఆ తర్వాత సమ్మర్ స్పెషల్‌గా మే 9న వద్దామనుకున్నారు. కానీ, అదే టైమ్‌లో రవితేజకు షూటింగ్‌లో గాయం కావడంతో ఆ డేట్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఫ్యాన్స్ కూడా, "సరే, కొంచెం లేటైనా పర్లేదు, మాస్ రాజా హెల్త్ ముఖ్యం" అని సర్దుకుపోయారు.

అక్కడితో ఆ వాయిదాల పర్వం ఆగలేదు. ఓటీటీ డీల్స్ సెట్ కాకపోవడం, ఇతర టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమాను ఆగస్టు 27కి షిఫ్ట్ చేశారు. అన్నీ కుదిరి ఇక రిలీజ్‌కి రెడీ అవుతున్న కీలక సమయంలో, ప్రొడ్యూసర్ నాగవంశీకి 'కింగ్‌డమ్', 'వార్ 2' రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో, ఆ నెగెటివ్ బజ్ మధ్య 'మాస్ జాతర'ను రిలీజ్ చేయడం రిస్క్ అని భావించి, మళ్లీ హోల్డ్ చేశారు.

మార్కెట్‌లో ఉన్న నెగెటివ్ వైబ్స్‌ను పోగొట్టడానికి, ప్రమోషన్స్‌కు కావాల్సినంత గ్యాప్ తీసుకొని, ఫైనల్‌గా అక్టోబర్ 31కి ఫిక్స్ చేశారు. అంతకు ఒక రోజు ముందే, అంటే అక్టోబర్ 30 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఇక ఫ్యాన్స్ కూడా "సరే, ఈసారైనా పక్కా" అని సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టారు. కానీ, 'బాహుబలి' రీ రిలీజ్ రూపంలో వచ్చిన ఈ కొత్త ట్విస్ట్‌తో 'మాస్ జాతర' టీమ్ మళ్లీ ఆలోచనలో పడింది.

లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం, 'బాహుబలి'తో అనవసరమైన పోటీని తప్పించుకోవడానికి, ఒక్కరోజు వెనక్కి తగ్గాలని టీమ్ డిసైడ్ అయిందట. నవంబర్ 1న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని, ముందుగా అనుకున్నట్లే అక్టోబర్ 31 రాత్రి మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మరి, ఈ నవంబర్ 1 అయినా 'మాస్ జాతర'కు ఫైనల్ రిలీజ్ డేట్ అవుతుందో, లేక ఇంకేమైనా ట్విస్ట్‌లు ఉన్నాయోమో చూడాలి.