రవితేజ ల్యాండ్ మార్క్ సింపుల్ గానే!
స్టార్ హీరోల ల్యాండ్ మార్క్ చిత్రాలంటే ప్రత్యేకమైన ప్లానింగ్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ సినిమాలంటే రెగ్యులర్ సినిమాలకంటే రెట్టించిన అంచనాలు నెలకొంటాయి.
By: Srikanth Kontham | 30 Oct 2025 2:00 PM ISTస్టార్ హీరోల ల్యాండ్ మార్క్ చిత్రాలంటే ప్రత్యేకమైన ప్లానింగ్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ సినిమాలంటే రెగ్యులర్ సినిమాలకంటే రెట్టించిన అంచనాలు నెలకొంటాయి. ఈనేపథ్యంలో హీరోలు ఇలాంటి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కథ ప్రత్యేకంగా ఉండాలని...డైరెక్టర్ సీనియర్ అయి ఉండాలని..నిర్మాణ సంస్థ అగ్రగామిదై ఉండాలని చాలా మంది స్టార్లు భావిస్తుంటారు. కానీ మాస్ రాజా రవితేజ కు మాత్రం అలాంటి దేమి ఉండదని తెలుస్తోంది. ఏదైనా అది మంచి సినిమా అయితే చాలు అన్న తీరులో కనిపిస్తున్నారు.
నెంబర్ గురించి పట్టించుకోలేదు:
ప్రస్తుతం రవితేజ హీరోగా `మాజ్ జాతర` రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెంబర్ ఎంతో తెలుసా? అక్షరాల 75వ చిత్రం అవును. ఈ విషయాన్ని డైరెక్టర్ భాను భోగవరపు చెప్పే వరకూ గానీ విషయం వెలుగులోకి రాలేదు. `మాస్ జాతర` 75వ చిత్రమని తనకి కూడా తెలియదన్నాడు. ఓసారి వికీలోకి వెళ్లి రవితేజ నటించిన సినిమాలన్నీ లెక్కిస్తే `మాస్ జాతర` 75వ నెంబర్ చ్చిందని తెలిపారు. ఇదే విషయాన్ని రవితేజకు చెబితే నెంబర్ గురించి ఆలోచించొద్దని ప్రశాంతంగా సినిమా తీసుకోమని సెలవిచ్చారు.
అదే అనుభవంతో అవకాశం:
కథ బాగున్నప్పుడు దేని గురించి ఆలోచించొద్దని చెప్పడంతోనే తాను అనుకున్నది అనుకున్నట్లు తీయగలరు. మాస్ కథే అయినా రవితేజ మార్క్ హాస్యం మాత్రం పుష్కలంగా ఉంటుందన్నారు. భాను భోగవరపు దర్శ కుడిగా ఇదే తొలి సనిమా. అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది. మంచి రైటర్ గానూ ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. అది చూసిన రవితేజ.. భాను డైరెక్టర్ అవ్వడానికి ఈ క్వాలిపికేషన్స్ చాలు అని భావించి `మాస్ జాతర` కథ చెప్పగానే నచ్చడంతో ఒకే చేసినట్లు తెలుస్తోంది.
కష్టం తెలిసిన నటుడు రవితేజ:
కొత్త వాళ్లకు అవకాశాలివ్వడంలో రవితేజ పెద్దగా ఆలోచించరు. అసిస్టెంట్..అసోసియేట్ డైరెక్టర్ పనిచేసిన అనుభవం ఉండి..రైటర్ గా గుర్తింపు ఉంటే రాజా ఛాన్స్ ఇస్తరు. ఇప్పటి వరకూ చాలా మందికి దర్శకులుగా అవకాశం ఇచ్చారు. వాళ్లంతా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన వారే. రవితేజ ఇలా అవకాశాలివ్వడానికి ఓ కారణం ఉంది. రవితేజ కూడా హీరో కాకముందు డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పని చేసారు. అదే సమయంలో వివిధ శాఖల్లోనూ అనుభవం సంపాదించారు. నిజాయితీగా కష్టపడేవారు ఎలా ఉంటారు? మ్యానేజింగ్ చేస్తూ కాలక్షేం చేసే వారు ఎలా ఉంటారు? అన్నది రాజాకి బాగా తెలుసు. అందుకే కష్టాన్ని నమ్మిన అసిస్టెంట్లకు అవకాశాలు కల్సిస్తున్నారు.
