Begin typing your search above and press return to search.

దుబాయ్ రూమర్స్.. నాగవంశీ సీరియస్ గానే!

రెండు సినిమాల వల్ల భారీ నష్టాలను మూటగట్టుకుని దుబాయ్ వెళ్లిపోయారని ఆరోపించారు.

By:  M Prashanth   |   29 Oct 2025 12:40 PM IST
దుబాయ్ రూమర్స్.. నాగవంశీ సీరియస్ గానే!
X

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఇప్పటికే అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు పలు సినిమాలను రూపొందిస్తున్న ఆయన.. త్వరలో మాస్ జాతర మూవీతో సందడి చేయనున్నారు.

అయితే రీసెంట్ గా నాగవంశీ.. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్న సంగతి విదితమే. ఓవైపు భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసిన వార్-2 మూవీ డిజాస్టర్ గా మారడం.. మరోవైపు నిర్మించిన కింగ్ డమ్ సినిమా అంచనాలు అందుకోకపోవడంతో నాగవంశీని అనేక మంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

రెండు సినిమాల వల్ల భారీ నష్టాలను మూటగట్టుకుని దుబాయ్ వెళ్లిపోయారని ఆరోపించారు. ఆస్తులు అమ్మేశారని రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఆ ప్రచారంపై నాగవంశీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. అలాంటి ఊహాగానాలు స్ప్రెడ్ చేస్తున్న వారికి ఇప్పుడు మాస్ జాతర ప్రమోషన్స్ లో భాగంగా కౌంటర్స్ ఇస్తున్నారు.

నిజానికి దుబాయ్ వెళ్లారని రూమర్స్ తర్వాత.. తొలుత సోషల్ మీడియాలో సెటైరికల్ గా నాగవంశీ రెస్పాండ్ అయ్యారు. "ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ అది, వంశీ ఇది అంటూ ఫుల్ హడావిడి నడుస్తుంది. ఆ సమయం రాలేదు. కనీసం ఇంకో 10-15 సంవత్సరాలు ఉంది" అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు.

ఆ తర్వాత మాస్ జాతర మూవీకి సంబంధించిన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రీసెంట్ గా ఆస్తులు అమ్ముకునేంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో తనకు ఇప్పటికీ లాజిక్ అర్థం కాలేదని అన్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపై మాట్లాడుతూ నాగవంశీనే దుబాయ్ అంశాన్ని ప్రస్తావించి పలు వ్యాఖ్యలు చేశారు.

మాస్ జాతర మూవీపై తనకు నమ్మకం ఉందని నాగవంశీ తెలిపారు. ముఖ్యంగా సినిమాలో ర‌వితేజ నుంచి ఆయ‌న అభిమానులతోపాటు నార్మల్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు కూడా ఉంటాయని అన్నారు. ఈసారి తాను సినిమా గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదని వ్యాఖ్యానించారు.

ఈ సారి ప్రేక్షకులే సినిమా చూసి పాజిటివ్ గా మాట్లాడతారని అనుకుంటున్నానని చెప్పారు. ఆ తర్వాత చివరగా ఈసారి ఏం జ‌రిగినా దుబాయ్‌ కు మాత్రం వెళ్ల‌న‌ంటూ వ్యాఖ్యానించారు నాగవంశీ. అంతే కాదు.. ఆ విష‌యంలో ఎవ‌రూ ఎక్కువ టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌ని లేద‌ని ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.