Begin typing your search above and press return to search.

రవితేజ 'మాస్ జాతర'.. సరైన మెలోడీ సాంగ్ ఆగయా..

తాజాగా మేకర్స్ మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ నుంచి సరైన మెలోడీ హుడియో హుడియో ప్రోమోను సోమవారం ఉదయం విడుదల చేశారు.

By:  M Prashanth   |   6 Oct 2025 1:09 PM IST
రవితేజ మాస్ జాతర.. సరైన మెలోడీ సాంగ్ ఆగయా..
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మాస్ జాతర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ అవ్వనుంది. దీంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్‌ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో సినీ ప్రియులు, రవితేజ ఫ్యాన్స్.. మంచి హోప్స్ పెట్టుకున్నారు. అయితే మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి.

సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ కు ఫిదా అయ్యారు. సాంగ్స్ అదిరిపోయాయని అంతా కామెంట్లు పెట్టారు. తాజాగా మేకర్స్ మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ నుంచి సరైన మెలోడీ హుడియో హుడియో ప్రోమోను సోమవారం ఉదయం విడుదల చేశారు.

నా గుండె గాలిపటమల్లె ఎగరేసేవే అంటూ సాగుతున్న సాంగ్ ను దేవ్ రాయగా.. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. హేశం అబ్దుల్ వాహిద్ తో కలిసి ఆయన ఆలపించారు. రవితేజ – శ్రీలీలపై చిత్రీకరించిన ఈ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా బాగుందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

లిరిక్స్, కంపోజిషన్, వాయిస్ అన్నీ బాగున్నాయని చెబుతున్నారు. చార్ట్ బస్టర్ సాంగ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయని అంటున్నారు. రవితేజ, శ్రీలీల లుక్స్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు. సినిమా కోసం వెయిటింగ్.. మంచి హిట్ అయ్యేలా ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

కాగా, పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఆ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫోర్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ బేరి, నితీష్ నిర్మల్ , రితు పి సూద్, కృష్ణ కుమార్, పాండు చిరుమామిళ్ల సహా పలువురు నటిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.