స్పెషల్ వీడియోతో రిలీజ్ డేట్ అనౌన్స్.. మాస్ జాతర వచ్చేది ఎప్పుడంటే?
ఈ నెల 31 నుంచి థియేటర్లలో హంగామా పక్కా అని తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించారు.
By: M Prashanth | 1 Oct 2025 8:33 PM ISTమాస్ మహారాజ రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా మాస్ జాతర. భాను భోగవరపు ఈ సినిమాను కామెడీ, యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా మేకర్స్ పలుమార్లు వాయిదా వేశారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఓ స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్ కు మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఈ వీడియోలో హైపర్ ఆది- రవితేజ మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా పలు మార్లు వాయిదా పడిన నేపథ్యంలో పాత సీన్స్ కూడా ఇందులో యాడ్ చేశారు. ఇందులో రవితేజను ఆది తొలుత.. అన్నా మాస్ జాతర సినిమా బాగా వచ్చింది. రిలీజ్ ఎప్పుడన్నా? అని అడుగుతాడు. దీనికి రిప్లైగా రవితేజ సంక్రాతికి అని చెబుతారు. తీరా సంక్రాంతి వచ్చాక.. షూటింగ్ లో గాయం వల్ల డీలే అయ్యిందటూ, మే 9 పక్కా అంటూ ఆదికి చెప్తారు.
ఇక ఫైట్ సీన్ లో కాలికి గాయం అవ్వడం వల్ల సినిమా వినాయక చవితి ఆగస్టు 27కు పోస్ట్ పోన్ అయ్యిందని చెప్తారు. దీంతో వినాయకుడి విగ్రహం పట్టుకొని వచ్చి మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందని గుర్తు చేస్తారు. దీంతో ఈసారి పక్కా అక్టోబర్ 31కు రావడం కన్ఫార్మ్ అయ్యిందంటూ కొత్త రిలీజ్ డేట్ రివీల్ చేశారు. దీంతో మాస్ మహారాజ ఫ్యాన్స్ రిలీజ్ కు రెడీ అయిపోతున్నారు. అలాగే అందరిలా కాకుండా వెరైటీగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కూడా నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె, హీరోకు పలుమార్లు గాయాలు అవ్వడం, ఇంకా పలు కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ట్రైలర్ ను వదిలి.. ఆపై ప్రమోషన్స్ మొదలు పెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ధమాకా తర్వాత ఆయన సరైన హిట్ అందుకోలేదు.
కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి స్పందన దక్కించుకుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ధమాకా సినిమా తర్వాత రెండోసారి రవితేజతో జతకట్టింది. ఈ సక్సెస్ ఫుల్ జోడీ మరోసారి సినిమాకు పనిచేయడంతో ఈ ప్రాజెక్ట్ పక్కా మంచి విజయం ఖాయమని ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ నెల 31 నుంచి థియేటర్లలో హంగామా పక్కా అని తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించారు.
