Begin typing your search above and press return to search.

బాత్రూమ్ లో 'మసూద' బ్యూటీ అందాల ఆరబోత.. ఫోటోలు వైరల్!

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు అందుకుంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   5 Feb 2026 10:55 AM IST
బాత్రూమ్ లో మసూద బ్యూటీ అందాల ఆరబోత.. ఫోటోలు వైరల్!
X

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు అందుకుంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా పెద్దదా చిన్నదా అని ఆలోచించకుండా అవకాశం వస్తే చాలు తమను తాము నిరూపించుకోవాలని చూస్తున్న హీరోయిన్స్ లో బాంధవీ శ్రీధర్ కూడా ఒకరు. ప్రముఖ దర్శకుడు సాయికిరణ్ దర్శకత్వంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ 'మసూద' చిత్రంతో తనను తాను ప్రూవ్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన ఈ తెలుగమ్మాయి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది.




అయితే సాధారణంగా హీరోయిన్స్ తమ గ్లామర్ ఫోటోలను పంచుకోవడానికి ఎక్కువగా ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది బెడ్ రూమ్లో మరి కొంతమంది గార్డెన్ ఏరియా ఇంకొంతమంది తమకు నచ్చిన ప్రదేశాలలో ఫోటోషూట్ నిర్వహిస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ అమ్మడు తాజాగా బాత్రూం నుండి స్టిల్స్ పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫోటోషూట్ తీయించుకోవడానికి వేరే ప్లేస్ దొరకలేదా? అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.




లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ట్రెండీ లుక్ లో ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటోలు పంచుకుంది. ముఖ్యంగా ఈమె ఇచ్చిన ఫోజులకు అభిమానులు, నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ తన అందాలతో అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా ఇలా ట్రెండీగా ఫోటోషూట్ చేసి మరింత పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ చిన్నది. మొత్తానికైతే ఈమె.. షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




బాంధవీ శ్రీధర్.. ఈమె మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టి, ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలంగాణలోని హైదరాబాదులోనే పుట్టి పెరిగిన ఈమె బాల నటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించింది. మిస్టర్ పర్ఫెక్ట్, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను వంటి అనేక చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది బాంధవి. 2019లో మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2019, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019 టైటిల్స్ ను కూడా గెలుచుకుంది. ఇక 2022లో సాయికిరణ్ దర్శకత్వంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ మసూద ద్వారా నటన రంగ ప్రవేశం చేసింది. ఇందులో నాజియా అనే పాత్రలో నటించి నటిగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ పాత్ర బాంధవికి మంచి ఇమేజ్ ను అందించింది.

ఆ తర్వాత 2024లో తమిళ క్రైం థ్రిల్లర్ 'లైట్ హౌస్' లో ఒక పాత్ర పోషించిన ఈమె.. సన్నీ డియోల్ సరసన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ' జాట్ ' ఈమె కెరీర్ కు మంచి ఊపునిచ్చింది..

2025 లో వచ్చిన ఈ సినిమాతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరును దక్కించుకుంది. ఇకపోతే ప్రస్తుతం మరో ప్రాజెక్టు ప్రకటించలేదు కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకోవడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనా బాంధవీ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈమెకు హీరోయిన్గా అవకాశం ఇవ్వాలని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.