'ది రాజా సాబ్' హిందీ మార్కెట్ పరిస్థితేంటీ?
`బాహుబలి` తరువాత తెలుగు సినిమా మార్కెట్ తారా స్థాయికి చేరింది. తెలుగులో స్టార్ హీరో సినిమా అంటే బాలీవుడ్ నుంచి ఎంక్వైరీలు ఓ రేంజ్‌లో జరగడం మొదలైంది.
By: Tupaki Entertainment Desk | 1 Jan 2026 6:09 PM IST`బాహుబలి` తరువాత తెలుగు సినిమా మార్కెట్ తారా స్థాయికి చేరింది. తెలుగులో స్టార్ హీరో సినిమా అంటే బాలీవుడ్ నుంచి ఎంక్వైరీలు ఓ రేంజ్‌లో జరగడం మొదలైంది. రీమేక్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, య్యూట్యూబ్ రైట్స్ కు కూడా భారీగా డిమాండ్ ఏర్పడి బాలీవుడ్ వర్గాలు పోటీపడటంతో మన వాళ్ల ఆనందానికి అవధులే లేకుండా పోతున్నాయి. స్టార్ హీరో నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోల సినిమాల డబ్బింగ్ రైట్స్ వరకు హిందీ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉండటంతో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతోందంటే హిందీ మార్కెట్‌లో అటెన్షన్, ఎంక్వైరీలు సహజం.
అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న `ది రాజా సాబ్` జనవరి 9న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో హిందీ మార్కెట్‌పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. `ది రాజాసాబ్` హిందీ మార్కెట్ పరిస్థితేంటీ? .. ఇప్పటికే అక్కడ వరుసగా హారర్ కామెడీ థ్రిల్లర్‌లు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో `ది రాజాసాబ్`కు స్పేస్ ఉంటుందా? .. అనుకున్న స్థాయిలో అక్కడ ఆదరణ దక్కుతుందా? అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా హిందీలో ప్రభాస్ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. అదే ప్రధాన పాత్ర పోషిస్తోంది. మరి `ది రాజా సాబ్` విషయంలో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలకు తాజాగా దర్శకుడు మారుతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `హారర్ కామెడీ అనేది హిందీ మార్కెట్‌లో మంచి జోనర్. హారర్ కామెడీ జోనర్ అనేది స్టార్ట్ చేసిందే మన సౌత్‌లో. లారెన్స్ కాంచన సిరీస్‌లు కానీ నేను తీసిన చిన్న సినిమా `ప్రేమ కథా చిత్రమ్ కానీ సౌత్‌లో బగా ఊపేశాయి. మన దగ్గర బాగా పాపులర్ అయిన హారర్ జోనర్‌ని ఇప్పుడు వాళ్లు ఎత్తుకున్నారు.
`స్త్రీ` తరువాతే ఇలాంటి సినిమాల పరంపర బాలీవుడ్‌లో ఎక్కువైంది. బాలీవుడ్‌కు చాలా ఇష్టమైన జోనర్ హారర్ కామెడీ. అయితే `ది రాజా సాబ్‌ని రెగ్యులర్ హారర్ కామెడీతో చేయలేదు. ఫాంటసీగా చేశాం. ప్రేక్షకుల్ని భయపెట్టే అంశాలు అక్కడ డక్కడ కొన్ని ఉన్నా కానీ సటగు ప్రేక్షకుడికి మేము క్రియేట్ చేసిన రాజా సాబ్ ఫాంటసీ వరల్డ్ బాగా నచ్చుతుంది. అందుకని ఈ మూవీని హిందీ ఆడియన్స్ మిస్ చేసుకోరని అనుకుంటున్నాను నేను` అని క్లారిటీ ఇచ్చారు.
సంజయ్‌దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీలో ఆయనకు ప్రభాస్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా ఉంటాయని తెలుస్తోంది. ఇవి బాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. బోమన్ ఇరానీ, జరీనా వాహెబ్ వంటి సీనియర్ నటుల నటన, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌ల గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే `ది రాజా సాబ్` పాన్ ఇండియా హిట్ కావడం గ్యారంటీ.
