Begin typing your search above and press return to search.

అలా ఇద్ద‌రం క‌లిసి చేసిన జ‌ర్నీనే రాజా సాబ్

జ‌న‌వ‌రి 9న ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Jan 2026 4:28 PM IST
అలా ఇద్ద‌రం క‌లిసి చేసిన జ‌ర్నీనే రాజా సాబ్
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కామెడీ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్, మాళ‌విక మోహ‌న‌న్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా, సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

సంక్రాంతికి రాజా సాబ్ రిలీజ్

జ‌న‌వ‌రి 9న ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. వాస్త‌వానికి రాజా సాబ్ ఎప్పుడో రిలీజ‌వాల్సింది కానీ షూటింగ్ ఆల‌స్య‌మ‌వ‌డం వ‌ల్ల రిలీజ్ వాయిదా ప‌డింది. ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ వేగాన్ని బాగా పెంచింది.

ఫ‌స్ట్ లుక్ తో అంచ‌నాల్ని పెంచేసిన మారుతి

రాజా సాబ్ సినిమా మొద‌లు పెట్ట‌క‌ముందు అస‌లు ఈ సినిమాపై ప్ర‌భాస్ ఫ్యాన్స్ తో స‌హా ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను చేయొద్ద‌ని సోష‌ల్ మీడియాలో హ్యాష్ ట్యాగుల‌తో ట్రెండ్ కూడా చేశారు. కానీ ప్ర‌భాస్ క‌థ‌ను, మారుతిని న‌మ్మి ఈ సినిమాను పూర్తి చేశారు. ఎప్పుడైతే రాజా సాబ్ నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చిందో అప్ప‌ట్నుంచి ఈ మూవీపై అంచ‌నాలు పెరుగుతూ వ‌చ్చాయి.

టీజ‌ర్, ట్రైల‌ర్ తో మ‌రింత ఇంప్రెస్ అయిన ఆడియ‌న్స్

ప్ర‌భాస్ ను వింటేజ్ లుక్ లో చూపించ‌డ‌మే కాకుండా రాజా సాబ్ గ్లింప్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ తో ఫ్యాన్స్, ఆడియ‌న్స్ ను విప‌రీతంగా మెప్పించారు మారుతి. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. అయితే ఇదంతా ఎలా సాధ్య‌మ‌ని రీసెంట్ గా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో మారుతిని అడ‌గ్గా, దానికి ఆయ‌న చెప్పిన స‌మాధానం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

తాను యానిమేష‌న్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వ‌చ్చాన‌ని, ప్ర‌భాస్ గారికి కూడా యానిమేష‌న్, గ్రాఫిక్స్ గురించి మంచి అవ‌గాహ‌న ఉంద‌ని, ఒక క్రియేచ‌ల్ ఇలా ఉండాల‌ని అనుకున్న‌ప్పుడు దాన్ని తాను డ్రా చేసి చూపించేవాడిన‌ని, ప్ర‌భాస్ గారు కూడా ఇలాంటి క్రియేచ‌ర్ ఉంటే బావుంటుంద‌ని చెప్పేవార‌ని, అలా ఇద్ద‌రం క‌లిసి ఒక జ‌ర్నీలా చేసిన సినిమానే రాజా సాబ్ అని ఈ క్రెడిట్ ను తాను మాత్ర‌మే తీసుకోకుండా హీరో ఖాతాలో కూడా వేశారు ప్ర‌భాస్.