ఫ్లాప్ మర్చిపోతారు.. కానీ ఈ నెగటివిటీ మర్చిపోరా? డైరెక్టర్‌కు గట్టి పరీక్ష!
టాలీవుడ్‌లో ఒక సినిమా రిజల్ట్ డైరెక్టర్ కెరీర్‌ను ప్రభావితం చేయడం కొత్త విషయం కాదు.
By: Sravani Lakshmi Srungarapu | 14 Aug 2026 10:00 PM ISTటాలీవుడ్‌లో ఒక సినిమా రిజల్ట్ డైరెక్టర్ కెరీర్‌ను ప్రభావితం చేయడం కొత్త విషయం కాదు. కానీ ఇటీవల పరిస్థితులు చూస్తే బాక్సాఫీస్ ఫలితాల కంటే సోషల్ మీడియా డిస్కషన్స్, పబ్లిక్ కమ్యూనికేషన్, డైరెక్టర్ పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ కూడా కెరీర్ దిశను డిసైడ్ చేస్తున్న అంశాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతీ చుట్టూ జరుగుతున్న డిస్కషన్స్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు తెరకెక్కిస్తూ మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మారుతీ, ఇప్పుడు తన తర్వాతి సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి కారణం రాజా సాబ్ ఈవెంట్ లో ఆయన పబ్లిక్ గా చేసిన కామెంట్స్. సినిమా బాలేకపోతే తన ఇంటికి వెళ్లి అడగొచ్చని, స్టేజ్ పైనే ఇంటి అడ్రెస్ ను చెప్పడం, ఆ తర్వాత రాజా సాబ్ రిజల్ట్ ఏంటనేది అందరికీ తెలసిన విషయమే. సినిమా ఫలితం ఒక్కటే సమస్య కాదని, దాని చుట్టూ ఏర్పడే నెగటివ్ నేరేటివ్ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సోషల్ మీడియా యుగంలో డైరెక్టర్ పర్సనల్ బ్రాండ్ కూడా ఒక మార్కెట్ ఫ్యాక్టర్‌గా మారింది. ఒకప్పుడు హీరోల మార్కెట్ గురించే ఎక్కువగా మాట్లాడేవారు. ఇప్పుడు డైరెక్టర్ ట్రాక్ రికార్డ్‌తో పాటు అతని పబ్లిక్ ఇమేజ్, ఆడియన్స్‌లో ఉన్న నమ్మకం, ఆన్‌లైన్ సెంటిమెంట్ కూడా నిర్మాతల నిర్ణయాల్లో పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాల్లో డైరెక్టర్ బ్రాండ్ వ్యాల్యూ ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్, ఓటీటీ ఇంట్రెస్ట్‌పై కూడా ప్రభావం చూపుతోంది.
ఇదే సమయంలో టైర్2 హీరోల మార్కెట్ కూడా బలపడుతోంది. స్టార్ హీరోల డేట్లు దొరకడం కష్టమవుతున్న నేపథ్యంలో నిర్మాతలు బడ్జెట్‌ను కంట్రోల్ చేస్తూ మంచి కథలతో ముందుకు వెళ్లే డైరెక్టర్లను వెతుకుతున్నారు. అలాంటప్పుడు సరైన కాంబినేషన్ దొరికితే సినిమా త్వరగా పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మారుతీ తర్వాతి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుంది, ఏ జానర్‌లో ఉంటుంది అనే అంశాలపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు కేవలం హిట్ ఇవ్వడం మాత్రమే కాదు, తనపై ఏర్పడిన నెగిటివిటీని మార్చి, మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మకాన్ని గెలుచుకోవాల్సిన సవాల్ ఇప్పుడు మారుతీ ముందుంది.
