Begin typing your search above and press return to search.

మారుతి.. ఈసారి మళ్లీ 'బస్ స్టాప్' ప్లాన్‌ తోనా!

దర్శకుడు మారుతి మళ్లీ తన పాత స్టైల్‌ లో సినిమా చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

By:  M Prashanth   |   26 Oct 2026 2:00 PM IST
మారుతి.. ఈసారి మళ్లీ బస్ స్టాప్ ప్లాన్‌ తోనా!
X

దర్శకుడు మారుతి మళ్లీ తన పాత స్టైల్‌ లో సినిమా చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభాస్‌ తో చేసిన 'ది రాజా సాబ్' తర్వాత ఆయన చేయబోయే కొత్త సినిమా ఎలా ఉంటుందనే ఇంట్రెస్ట్ అందరిలో నెలకొంది. ఈసారి కొత్త క్యాస్టింగ్ తో ఓ కామెడీ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మారుతి కెరీర్ స్టార్టింగ్ లో తీసిన 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' సినిమాలు గుర్తుకొస్తున్నాయి.

మారుతి మొదట్లో చిన్న బడ్జెట్‌ తో సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త క్యాస్టింగ్ తో యూత్ కు నచ్చే కథలను స్క్రీన్ పై చూపించారు. ముఖ్యంగా కామెడీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రేక్షకులను నవ్వించారు. ఆ సినిమాల విజయంతోనే పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు మళ్లీ తనకు బాగా తెలిసిన కామెడీ కథల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్‌ తో చేసిన 'ది రాజా సాబ్' మారుతికి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీసేటప్పుడు స్టోరీపై మరింత శ్రద్ధ పెట్టాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ సినిమా రిజల్ట్ తర్వాత మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్టుపై కంప్లీట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఈసారి మారుతి కొత్త క్యాస్టింగ్ తో సినిమా చేయాలని భావిస్తున్నారట. తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయ్యాయని, నవంబర్ 2026లో షూటింగ్ మొదలుపెట్టి, 2027 వేసవిలో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. 'ఎంటర్టైనింగ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మారుతి మళ్లీ చిన్న సినిమాల వైపు వెళ్లడం వెనుక ఓ కారణం కనిపిస్తోంది. ఆయన స్త్రెంత్ కామెడీ కథలు, కొత్త నటీనటులతో సినిమాలు చేయడమే. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' చిత్రాలతో ఆ విషయాన్ని ఇప్పటికే ప్రూవ్ చేశారు. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్' వంటి సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో సినిమా తీస్తే విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది.

కానీ పాత రోజులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవాలంటే కామెడీ ఒక్కటే సరిపోదు. స్టోరీలో ఇంట్రెస్ట్, రోల్స్ లో నేచురాలిటీ ఉండాలి. అప్పుడే సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ కు చేరువవుతుంది. అదే సమయంలో ప్రభాస్‌ తో భారీ సినిమా చేసిన మారుతి ఇప్పుడు కొత్తవారితో చిన్న సినిమా చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

పెద్ద హీరోతో సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అదే కొత్త నటీనటులతో సినిమా చేస్తే కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే బడ్జెట్ చిన్నదైనా ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ కాదు. ఏదేమైనా 'రాజా సాబ్' తర్వాత మారుతికి తన స్త్రెంత్ మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి తనకు అలవాటైన కామెడీ కథతో వస్తే ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారనేది వేచి చూడాలి.