మారుతికి ఫ్లాప్ రావాలని అనుకుంటున్నది ఎవరు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ కామెడీ హారర్ థ్రిల్లర్ `ది రాజా సాబ్`. మారుతి డైరెక్ట్ చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే.
By: Tupaki Entertainment Desk | 1 Jan 2026 3:28 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ కామెడీ హారర్ థ్రిల్లర్ `ది రాజా సాబ్`. మారుతి డైరెక్ట్ చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. సంక్రాంతికి జనవరి 9న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలని ప్రారంభించిన టీమ్ వరుస ప్రమోషన్స్‌తో హోరెత్తించడానికి ప్లాన్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా దర్శకుడు మారుతి ప్రత్యేకంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన `ది రాజా సాబ్` గురించి, ఇండస్ట్రీ వర్గాల గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా `మీరు విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు. ఈ సినిమాకు కూడా ఆదరణ దక్కకూడదని అనుకుంటున్నారు. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు?` అని అడిగిన ప్రశ్నకు దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎదిగితే బిజీ అయిపోతానని కొందరు అలా భావిస్తున్నారు. `ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు కోరుకుంటారు. పక్కింటి వాళ్లు కారు కొనుక్కుంటె దానికి ఏదైనా కావాలని కోరుకోవచ్చు. ఈర్ష్య, అసూయ మానవ నైజం. నేపు విజయం సాధించి ఎదిగితే వాళ్లుకు దొరకనేమో అనే భయంతోనే అలా అనుకుంటారు.
నేను ఇప్పుడు చిన్న సినిమాల ఈవెంట్‌లకు వెళుతున్నాను. ఒక వేళ నాకు భారీ సక్సెస్ వస్తే అలా రానేమోనని వాళ్ల భయం. వాళ్లు అసూయ వల్ల అలా అనుకుంటున్నారు కానీ.. నేను అలా ఆలోచించే వాడిని కాదు. ఈ సారి కథ చెబుదామని వస్తే నేను పట్టించుకోనేమో. అదే ఫెయిల్ అయితే మనల్ని చూస్తాడని వాళ్లు అనుకుంటున్నారు` అని మారుతి చెప్పాడు. ఇంతకీ మారుతికి ఫ్లాప్ రావాలని, తను దర్శకుడిగా ఎదగొద్దని కోరుకుంటున్నది ఎవరు? ..ఆయన చుట్టూ ఉన్న వాళ్లే తను ఫ్లాప్ కావాలని కోరుకుంటున్నారా?
తన సహాయం పొందుతున్న వాళ్లే మారుతి దర్శకుడిగా `ది రాజాసాబ్`తో సక్సెస్ కాకూడదని ఫీలవుతున్నారా?..అలా వారు ఫీలవ్వడానికి మారుతి చెప్పినట్టు తను వారికి అందుబాటులో ఉండడనే అలా కోరుకుంటున్నారా? ..అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి ట్రై చేస్తున్న కామెడీ థ్రిల్లర్ మూవీ `ది రాజా సాబ్`. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ఓ మెన్షన్ నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్‌గా మారుతి దీన్ని తెరకెక్కించాడు. తాతగా బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజయ్‌దత్ నటిస్తుండగా, మనవడిగా చాలా ఏళ్ల తరువాత ఆ మెన్షన్ లోకి ప్రవేశించే వ్యక్తిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. పురాతన మెన్షన్‌లోకి ప్రభాస్ ప్రవేశించిన తరువాత ఎలాంటి సంఘటనలు జరిగాయి. వాటి నుంచి తను ఎలా బయటపడ్డాడు. మనవడికి తాత తలొగ్గాడా? లేక మనవడినే తాత తన ఆధీనంలోకి తీసుకున్నాడా? అన్నది తెలియాలంటే జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే.
