రాజా సాబ్ లో మ్యాసివ్ షాట్స్ లేవా? మారుతి ఏమన్నారంటే?
అదే సమయంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా మారుతి.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
By: M Prashanth | 3 Jan 2026 11:00 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. కామెడీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మారుతి రూపొందిస్తుండగా, యంగ్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
భారీ గ్రాఫిక్స్, పాన్ ఇండియా స్థాయి మేకింగ్ తో రూపొందుతున్న రాజా సాబ్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. దీంతో మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అదే సమయంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా మారుతి.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తుండగా.. అవి నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. సినిమాపై హైప్ కూడా క్రియేట్ చేస్తున్నాయి.
రీసెంట్ గా సినిమాలో ప్రభాస్ డబుల్ వినియోగంపై మాట్లాడారు. ప్రభాస్ నిల్చుంటే వచ్చే ఎక్స్ప్రెషన్ వేరు.. వేరే యాక్టర్ తో అంటే ఆయన వంటి ఉన్నవారితో చేయడం వేరని హోస్ట్ అడగ్గా, తాము అన్ని సందర్భాల్లో అలా తీయమని మారుతి తెలిపారు. హీరోయిన్స్ తో సీన్స్ అన్నీ ప్రభాసే చేస్తారని, ముందే ఆయన చేస్తానని తనకు చెబుతారని తెలిపారు మారుతి.
యాక్ట్రెసెస్ కు డార్లింగ్ ఫుల్ కంఫర్ట్ ఇస్తారని తెలిపారు. ముఖ్యంగా హీరోయిన్స్ కు ఆయన ఇచ్చే గౌరవమే వేరని అన్నారు. వాళ్లు ఏం టైమ్ కు వస్తారనేది ముందుకు కనుక్కుంటారని, అప్పుడు వాళ్ల ఎక్స్ప్రెషన్స్ తో మ్యాచ్ అయ్యే వరకు ఉంటానని చెబుతారని వెల్లడించారు. ఆ తర్వాత సినిమాలో మ్యాసివ్ షాట్స్ కోసం మాట్లాడారు.
మ్యాసివ్ షాట్ ట్రైలర్ లో ఎక్కడా కనపడలేదని హోస్ట్ అనగా.. సినిమాలో అలాంటి షాట్స్ ఉన్నాయని మారుతి తెలిపారు. వంద మంది ఒకేసారి పట్టుకోగా ప్రభాస్ తోస్తారు కదా.. అది మ్యాసివే షాటే కదా అని తెలిపారు. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో ఒక రాజ్యం ఉంటుంది.. కింగ్డమ్ అంటే జనాలు ఉండాలి కదా.. ఆ సీన్ తో పాటు నాన్నమ్మ నడుచుకుంటూ వస్తుంది.. ఏనుగులు ఉన్నాయి.. అది కూడా మ్యాసివే షాట్ అని తెలిపారు.
అయితే బాహుబలి మూవీలో బాహుబలి బాహుబలి వంటి సీన్స్ ట్రైలర్ లో లేవు కదా అని మళ్లీ హోస్ట్ వ్యాఖ్యానించగా.. అంటే ఇది బాహుబలి మూవీ కాదని చెబుతూ నవ్వేశారు మారుతి. ప్రస్తుతం ఆయన కామెంట్స్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
