Begin typing your search above and press return to search.

మారుతిపై మరీ అంత కక్ష్యనా? ఆగేదెప్పుడు?

టాలీవుడ్‌ లో హిట్లు, ఫ్లాపులు ఎప్పుడూ కామనే. అయినా కొన్ని సందర్భాల్లో ఫ్లాప్‌ సినిమా ప్రభావం వ్యక్తిగత స్థాయికి వెళ్లడం చర్చనీయాంశంగా మారుతోంది.

By:  M Prashanth   |   29 Jan 2026 11:39 AM IST
మారుతిపై మరీ అంత కక్ష్యనా? ఆగేదెప్పుడు?
X

టాలీవుడ్‌ లో హిట్లు, ఫ్లాపులు ఎప్పుడూ కామనే. అయినా కొన్ని సందర్భాల్లో ఫ్లాప్‌ సినిమా ప్రభావం వ్యక్తిగత స్థాయికి వెళ్లడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా దర్శకుడు మారుతి విషయంలో జరుగుతున్న పరిణామాలు సినీ వర్గాల్లో కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌ గా మారాయి. ఆయన దర్శకత్వం వహించిన రాజా సాబ్ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది.

పాన్ ఇండియా ప్రభాస్ నటించిన ఆ సినిమా భారీ హిట్ అవుతుందని అంతా అంచనా వేశారు. మారుతి కూడా అదే నమ్మకంతో ఉన్నారు. రిలీజ్ కు ముందు మూవీపై పెద్ద ఎత్తున హైప్ కూడా క్రియేట్ చేశారు. కానీ అనుకున్న రేంజ్ లో సినిమాతో మాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా.. ట్రోల్స్ ఆగడం లేదు.

అంతటితో ఆగకుండా.. కొన్ని రోజులుగా మారుతి ఇంటికి ఫుడ్ పార్సల్స్ పంపి కొందరు చాలా ఇబ్బంది పెడుతున్నారనే చెప్పాలి. నిజానికి.. సినిమాపై నమ్మకంతో మూవీ అభిమానుల అంచనాలను అందుకుంటుందని, ఏమైనా తేడా వస్తే తన ఇంటికే వచ్చి మాట్లాడొచ్చంటూ అడ్రస్ చెప్పారు మారుతి. దీంతో రిలీజ్ కు ముందు మారుతి ఇంటికి బిరియానీలు, ఫుడ్ పార్సిల్స్ కొందరు పంపించారు.

దీనిపై మారుతి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కానీ ఇప్పుడు ఆయన ఇంటికి వందల్లో ఫుడ్ పార్సిల్స్ వస్తున్నాయి. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ లోనే. దీంతో మారుతి ఇంటి వద్ద గందరగోళం ఏర్పడుతోంది. రోజూ డెలివరీ బాయ్స్ గేట్ వద్దకు రావడం, సెక్యూరిటీ వారిని అడ్డుకోవడం, తిరిగి వెళ్లిపోవడం.. ఇదే రోజూ జరుగుతున్న పరిస్థితి.

అందుకే ఇప్పుడు మారుతి ఆ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారట. సినీ పరిశ్రమలో హిట్, ఫ్లాప్స్ సహజం. ఒక సినిమా ఫలితం నచ్చలేదని వ్యక్తిగత స్థాయిలో వేధింపులకు దిగడం సరికాదన్న ఇప్పుడు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజా సాబ్ విషయాన్ని పక్కన పెట్టి, ప్రభాస్‌ లాగే అభిమానులు కూడా కూల్ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.

అదే సమయంలో ప్రభాస్ రెస్పాండ్ అవ్వాలని అనేక మంది నెటిజన్లు కోరుకుంటున్నారు. ఒక్క పోస్ట్ పెడితే.. మారుతి పడుతున్న ఇబ్బందులు ఆగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరూ కావాలని ఫ్లాప్ కోరుకోరని, కొన్ని తప్పుల వల్ల మూవీ రిజల్ట్ అలా వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అంతేగానీ ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదని.. అంతలా కక్ష్య పెట్టుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని చెబుతున్నారు.