Begin typing your search above and press return to search.

మారుతి లిస్ట్ లో మెగాస్టార్..?

మన శంకర్ వరప్రసాద్, విశ్వంభర ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్ లో సినిమా ఒకటి చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   11 Dec 2025 5:00 PM IST
మారుతి లిస్ట్ లో మెగాస్టార్..?
X

మన శంకర్ వరప్రసాద్, విశ్వంభర ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్ లో సినిమా ఒకటి చేస్తున్నారు. ఆ సినిమాను మెగా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో కూడా చిరంజీవి సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఐతే మెగాస్టార్ చిరంజీవి ఈ రెండు సినిమాల తర్వాతనే నెక్స్ట్ సినిమా ఏంటన్నది డిసైడ్ చేస్తారట.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో..

ఐతే మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయాలని ప్రభాస్ డైరెక్టర్ ఆసక్తిగా ఉన్నాడు. అతను ఎవరో కాదు రాజా సాబ్ డైరెక్టర్ మారుతి. చిన్న సినిమాలతో మొదలు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు మారుతి. రాజా సాబ్ హిట్ పడితే అతని ఖాతాలో మరిన్ని సినిమాలు వచ్చి పడతాయి. ఐతే చిరంజీవితో మారుతి సినిమా ఉంటుందనే డిస్కషన్ ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది.

మెగా ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే మారుతి మంచి కథ ఉంటే చేద్దామని మెగాస్టార్ ఎప్పుడో చెప్పారు. ఐతే వెంకటేష్ తో సినిమా చేసిన మారుతి ఆ తర్వాత మళ్లీ యువ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఐతే రాజా సాబ్ తో రెబల్ స్టార్ ప్రభాస్ తోనే సినిమా చేసిన మారుతి. నెక్స్ట్ కూడా మరో స్టార్ హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే ఈ క్రమంలోనే చిరంజీవితోనే మారుతి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాడట.

పుష్ప రాజ్ తో మారుతి సినిమా..

ఇప్పటికే మారుతి ఒక స్టోరీ లైన్ కూడా రాసుకున్నాడట. మెగా ఆమోద ముద్ర కోసం వెయిట్ చేస్తున్నాడు. ఐతే అల్లు అర్జున్ కి చాలా క్లోజ్ అయిన మారుతి పుష్ప రాజ్ తో ఎప్పుడు సినిమా చేస్తాడా అన్న డిస్కషన్ ఎప్పుడూ ఉంటుంది. ఐతే ఫ్రెండ్ అయినంత మాత్రాన మారుతికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నా సరైన కథ పడితే ఇద్దరు కలిసి రావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మారుతి మాత్రం ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా ప్రభాస్ రాజా సాబ్ మీదే పెట్టాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఏంటన్నది అది ఇచ్చే రిజల్ట్ ని బట్టి డిసడి చేసేలా ఉన్నాడు. మారుతి మెగాస్టార్ చిరంజీవి ఈ కాంబో సెట్ అయితే మాత్రం చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ని మారుతి పర్ఫెక్ట్ గా వాడుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ఈ కాంబినేషన్ అసలు కుదిరే ఛాన్స్ ఉందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

ప్రభాస్ తర్వాత మళ్లీ యంగ్ హీరోలతోనే మారుతి సినిమా చేసినా ఈసారి పాన్ ఇండియా ఇంపాక్ట్ ఉన్న సినిమా చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు. ఎలాగు హీరోలతో సంబంధం లేకుండా సినిమాలు నేషనల్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మారుతి ఆఫ్టర్ రాజా సాబ్ సినిమా కూడా పాన్ ఇండియా ఉంటుందేమో తెలియాల్సి ఉంది.