Begin typing your search above and press return to search.

అమ్మ‌లంతా రిలాక్స్ మోడ్ లోకి జారుకుంటున్నారా?

ప‌ని త‌క్కువ ఫ‌లితంగా ఎక్కువ‌గా ఆశీస్తున్న‌ట్లు దీపిక మాటల్లో స్ప‌ష్ట‌మైంది. దీంతో ఛాన్సుల ప‌రంగా తొంద‌ర ప‌డ కుండా ప్ర‌శాంత‌మైన‌ పాత్ర‌ల్ని ఎంచుకుంటుంది.

By:  Srikanth Kontham   |   30 Dec 2025 11:00 AM IST
అమ్మ‌లంతా  రిలాక్స్ మోడ్ లోకి జారుకుంటున్నారా?
X

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొంత కాలంగా పెళ్లైన‌...త‌ల్లైన భామ‌ల‌దే హ‌వా క‌నిపిస్తోంది. పెళ్లికాని హీరోయిన్లు మ్యారీడ్ లైఫ్ లోకి అడుగు పెట్టిన వారికే అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి అన్న‌ది కాద‌న‌లేని నిజం. మార్కెట్ రెట్టింపు అవ్వ‌డంతో డిమాండ్ పెరిగింది. ప్ర‌తిగా అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇంకా తెర‌పైకి కొత్త డిమాండ్ల‌ను సైతం తెస్తున్నారు. వీరిలో ప్ర‌ముఖంగా ఓ హీరోయిన్ గా ఉండ‌గా, మిగిలిన ఇద్ద‌రు మాత్రం బ్యాలెన్స్ గా కెరీర్ ను ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో కొంత గ్యాప్ కూడా తీసుకోవ‌డంతో రిలాక్స్ మోడ్ లోకి జారుకుం టున్నారు.

ఆ వివ‌రాల్లోకి వెళ్తే బాలీవుడ్ న‌టి దీపికా పుద‌కొణే పెళ్లైన ద‌గ్గ‌ర నుంచి కెరీర్ ని ఎంతో జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. బాలీవుడ్ చిత్రాల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త మ‌రే భాష‌కు ఇవ్వ‌డం లేదు. ఇటీవ‌లే `క‌ల్కీ2` నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు వ‌ర్కింగ్ హావ‌ర్స్ పై చ‌ర్చించి అంద‌రికీ నెగిటివ్ గానూ మారింది. అయినా దీపికా ఒక్క అడుగు కూడా వెన‌క్కి వేయ‌లేదు. త‌న గళాన్ని మ‌రింత బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ హిందీ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల‌ను మాత్రం తెలివిగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తోంది.

ప‌ని త‌క్కువ ఫ‌లితంగా ఎక్కువ‌గా ఆశీస్తున్న‌ట్లు దీపిక మాటల్లో స్ప‌ష్ట‌మైంది. దీంతో ఛాన్సుల ప‌రంగా తొంద‌ర ప‌డ కుండా ప్ర‌శాంత‌మైన‌ పాత్ర‌ల్ని ఎంచుకుంటుంది. వీలైనంత కంప‌ర్ట్ జోన్ లో ప‌ని చేయ‌డానికే చూస్తోంది. దీంతో కుటుంబానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ గ‌ల్గుతోంది. భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్...పాపాయితో కాల‌క్షేప స‌మయం పెంచు కుంది. ప్ర‌స్తుతం దీపిక చేతిలో ఉన్న‌వి రెండే ప్రాజెక్టులు. షారుక్ ఖాన్ తో `కింగ్` లో..బ‌న్నీతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తోంది. అలాగే మ‌రో న‌టి కియారా అద్వాణీ కూడా 2026 నుంచి మ‌రింత ప‌రిణ‌తితో ప‌నిచేస్తానంటోంది.

స్టోరీల ప‌రంగా సెల‌క్టివ్ గా ఉంటానంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయ‌డం కంటే? మంచి చిత్రాలు రెండైనా చేసినా కుటుంబానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించగ‌ల్గుతానంది. కియారా కూడా 8 గంట‌ల వ‌ర్కింగ్ హావ‌ర్స్ కి మ‌ద్ద‌తుగా నిలిచింది. ఇక అలియాభ‌ట్ పెళ్లైన ద‌గ్గ‌ర సినిమాల స్పీడ్ త‌గ్గించింది. పెళ్లికి ముందు అంత యాక్టివ్ గా సినిమాలు చేయ‌డం లేదు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలైనా వాటిలో త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఎంత‌? అన్న‌ది ఆలోచిస్తుంది. ఉమెన్ సెంట్రిక్ స్టోరీల‌పై ఎక్కువ ఆస‌క్తితో ఉంది. 2025లో అలియాభ‌ట్ నుంచి ఎలాంటి రిలీజ్ లేదు. `ఆల్పా` షూటింగ్ పూర్తి చేసింది. అలాగే `ల‌వ్ అండ్ వార్` షూట్ లో జాయిన్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా నెమ్మ‌దిగా సాగుతోంది. 2026 లో కొత్త ప్రాజెక్ట్ లు వేటికి క‌మిట్ అయిన‌ట్లు క‌నిపించ‌లేదు.