సోషల్ మీడియా డిస్కషన్.. ఏముంది ఆ సినిమాలో..!
సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక సినిమా గురించి విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది.
By: Ramesh Boddu | 3 Dec 2025 12:53 PM ISTసోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక సినిమా గురించి విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని డైలాగ్స్ ని వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఫెమినిస్ట్ ల రియాక్షన్ ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో అంతగా ఏముందు అంటే మగవారి సంపాదన మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది.. ఐతే అదే అమ్మాయి జాబ్ చేస్తుంటే మాత్రం అది ఆమె సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటారు. ఐతే ఈ సినిమాలో ఒక మగాడు సంపాదన ఎందుకు ఖర్చు చేస్తాడు.. ఎలా ఖర్చు చేస్తాడు అన్నది కోర్ట్ రూంలో ఒక లాయర్ తన సొంత అనుభవాల కోణంతో చెబుతాడు.
రియో రాజ్, మాళవిక మనోజ్ కలిసి..
ప్రస్తుతం ఈ సీన్ అంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రియో రాజ్, మాళవిక మనోజ్ కలిసి నటించిన ఆన్ పావం పొల్లతాత్తు సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత మరింత ట్రెండింగ్ లో ఉంది. సినిమా అక్టోబర్ చివర్లో థియేట్రికల్ రిలీజై పర్వాలేదు అనిపించుకోగా రీసెంట్ గా జియో హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ రిలీజైన దగ్గర నుంచి అందులోని సీన్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు.
ఐతే కొంతమంది ఇది కావాలని మహిళలను కించపరచేలా తీశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ మెజారిటీ పీపుల్ మాత్రం ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని దీన్ని మరోలా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఒక సినిమా సోషల్ మీడియాలో ఈ రేంజ్ డిస్కషన్ పాయింట్ అయ్యింది అంటే అది కచ్చితంగా సక్సెస్ అయినట్టే లెక్క.
పెళ్లైన మగాడి కష్టాల నేపథ్యంతో..
ఆల్రెడీ రియో రాజ్, మాళవిక మనోజ్ జో సినిమా చేశారు. ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటాయి. ముఖ్యంగా రియో రాజ్, మాళవిక జోడీ చూడముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి చేసిన ఆన్ పావం పొల్లత్తాత్తు సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లైన మగాడి కష్టాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో కేవలం మేల్ సైడ్ మాత్రమే సీన్స్ రాసుకున్నారంటూ కొందరు లేడీ ఆడియన్స్ అంటున్నా సినిమా మాత్రం ఒక రేంజ్ లో ట్రెండింగ్ కొనసాగిస్తుంది.
సినిమాలో చూపించినంత మాత్రాన ఇలా ఉంటుందా అని కొన్ని అనిపించినా రియల్ లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ సినిమాలో చూపించే దాని కన్నా ఇంకా ఎక్స్ ట్రీం లెవెల్లో ఉంటాయి. ఐతే రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంతో తీసే సినిమాలకు ఇలాంటి మిశ్రమ స్పందన రావడం కామనే. ఐతే సినిమా మీద ఒపీనియన్ చెప్పేందుకు కూడా ఓటీటీలో ఆన్ పావం పొల్లత్తాత్తు సినిమా తెగ చూస్తున్నారు నెటిజెన్లు.
