'యానిమల్' కాదు..'మార్కో' కా బాప్‌లా ఉందే!
ఇండిపెండెన్స్ తరువాత ముంబాయిలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్నాడు.
By: Tupaki Entertainment Desk | 21 Jan 2026 11:47 PM IST2024లో మలయాళ ఇండస్ట్రీలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ `మార్కో`. ఉన్ని ముకుందన్ హీరోగా అనీఫ్ అదేనీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యాక్షన్ సినిమాల్లో సంచలనం సృష్టించింది. హద్దులేని హింసతో..ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో వైలెన్స్ సినిమాలకు పరాకాష్టగా నిలిచి `మార్కో` సంచలనం సృష్టించింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలతో సెన్సార్ అభ్యంతరం చెప్పడం.. టెలివిన్‌లలో టెలీకాస్ట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో `మార్కో` టీవీల్లో ప్రదర్శనకు నోచుకోలేదు.
ఇలా యాక్షన్, వైలెన్స్ సన్నివేశాలతో వార్తల్లో నిలిచిన `మార్కో`ని మరిపిస్తోంది షాహీద్ కపూర్ నటించిన `ఓ రోమియో`. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సాజిద్ నదియా వాలా నిర్మించిన ఈ మూవీలో త్రిప్తి దిమ్రి మెయిన్ హీరోయిన్‌గా నటించింది. ఇతర కీలక పాత్రల్లో తమన్నా, దిషా పటానీ, నానా పటేకర్, అవినాష్ తివారీ, ఫరీదా జలాల్, అరుణ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. `12th ఫెయిల్` ఫేమ్ విక్రాంత్ మెస్సే కీలక అతిథి పాత్రలో నటించాడు. ఫస్ట్ లుక్‌తోనే అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ ట్రైలర్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు.
ఇండిపెండెన్స్ తరువాత ముంబాయిలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఓ గ్యాంగ్ స్టర్ తను ప్రేమించి అమ్మాయి కోసం ఎంత వరకు వెళ్లాడు?.. ఎలాంటి వైలెన్స్‌ని సృష్టించాడు? చివరికి ఎలాంటి విధ్వంసానికి పూనుకున్నాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథ. ముంబాయి గ్యాంగ్ స్టర్ ఎస్సేనీ ఉస్తారాగా షాహీద్ కపూర్, అతన్ని ప్రేమించే ప్రేయసిగా త్రిప్తి దిమ్రీ ఇందులో నటించారు. ప్రేమించిన యువతి కోసం రింగ్‌లోకి దిగే సన్నివేశాలతో ట్రైలర్ విజువల్స్‌ని స్టార్ట్ చేశారు.
తరువాత సన్నివేశాల్లో అతనికి సినిమాలంటే అమితమైన పిచ్చి అన్నట్టుగా చూపించాడు. ఆ తరువాత వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. షేవింగ్ నైఫ్‌తో ప్రత్యర్థి ముఖాన్ని రెండుగా చీల్చే సీన్..థియేటర్లో బేటా సినిమాలోని `హే థక్ థక్ కర్ నే లగా`.. సాంగ్ విజువల్స్ వస్తుండగా..స్క్రీన్ ముందు అడ్డంగా నిలబడి షాహీద్ షేవింగ్ నైఫ్‌తో విచక్షణా రహితంగా ప్రత్యర్థులపై విరుచుకుపడటం.. ఆ క్రమంలో రక్తం హోళీ ఆడుతున్న తరహాలో షాహీద్ ముఖంపై ఓ రంగులా చిందడం.. ఓళ్లు గగుర్పొడిచేలా ఉంది.
ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోయే హీరోకు రంకు మొగుడిలా నానా పటేకర్ క్యారెక్టర్ రంగప్రవేశం చేయడం..గన్ ఎక్కడ పెట్ట కూడదో అక్కడ పెట్టి బెదిరించడం..ఒక పని కోసం సుపారీ ఎంత తీసుకుంటావ్ అని హీరోయిన్ అడిగితే.. ఏమిస్తావ్.. పడుకుంటావా నాతో అని హీరో అనడం.. యాక్షన్ ఘట్టాల్లో గన్‌తో ప్రత్యర్థి తల పేల్చడం..ఫైనల్ షాట్‌లో హీరోయిన్‌నే పాండా డాల్‌కు లైటర్ అంటించి సిగరేట్ కాల్చుకుంటూ తనని అంటించడంతో ఎండ్ చేశాడు.. ఓవరాల్‌గా రా అండ్ రస్టిక్.. హింస, లస్ట్, బూతు డైలాగ్‌లు వాట్ నాట్ ఇలా అన్నింటిని నింపేసి `మార్కో`కి బాప్‌ల `ఓ రోమియో`ని సిద్ధం చేశారు. ఈ భీభత్సాన్ని ఫిబ్రవరి 13న బారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో దీనికి సెన్సార్ అడ్డు చెబుతుందా.. `ధురంధర్`లాగే వదిలేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
