Begin typing your search above and press return to search.

డిస్నీ నుంచి పెద్ద త‌ల‌కాయ ఎగిరిపోయిన‌ట్టేనా?

మార్క్ రుఫలోకు `స్పాయిలర్ కింగ్` అనే పేరుంది.. అంటే సినిమాల రహస్యాలను ముందే చెప్పేస్తారని సరదాగా అంటుంటారు.

By:  Sivaji Kontham   |   27 Jan 2026 7:00 AM IST
డిస్నీ నుంచి పెద్ద త‌ల‌కాయ ఎగిరిపోయిన‌ట్టేనా?
X

మార్క్ రుఫలోను డిస్నీ లేదా మార్వెల్ స్టూడియోస్ నుంచి తొలగించారనే వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఆయ‌న ఇప్ప‌టికీ త‌న ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. త‌న బాధ్య‌త‌లను ఆయ‌న నిర్వ‌ర్తిస్తున్నారు. రుఫలోను తొలగించారనే వార్త ఇంతలా వైరల్ కావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటి వివ‌రాల్లోకి వెళితే..

2026 గోల్డెన్ గ్లోబ్స్ వేడుకలో మార్క్ రుఫలో రెడ్ కార్పెట్‌పై అమెరికా ప్రభుత్వంపైనా, అప్పటి అధ్యక్షుడిపై చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఆయన `బి గుడ్` పిన్ ధరించి, మానవ హక్కుల గురించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. గతంలో గినా కరానో వంటి నటులను వారి రాజకీయ వ్యాఖ్యల వల్ల డిస్నీ తొలగించిన సందర్భాలు ఉండటంతో రుఫలోను కూడా అలాగే తీసేశారనే పుకార్లు వేగంగా వ్యాపించాయి.

చాలా మంది సోషల్ మీడియా యూజ‌ర్లు పాత స్క్రీన్‌షాట్‌లను ఇప్పుడు వాడుతున్నారు. 2018లో `అవెంజర్స్: ఎండ్‌గేమ్` టైటిల్‌ను మార్క్ రుఫలో లీక్ చేసినట్లు ఒక కామెడీ షోలో ద‌ర్శకులు రూసో బ్రదర్స్ సరదాగా ``మార్క్, యు ఆర్ ఫైర్డ్`` అని ట్వీట్ చేశారు. ఆ పాత కామెడీ బిట్‌ను ఇప్పుడు నిజమైన వార్తగా చిత్రీకరిస్తూ కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. అలాగే ఈ ఏడాది విడుద‌ల‌కు రానున్న `అవెంజర్స్: డూమ్స్‌డే` సినిమాలో హల్క్ పాత్ర ఉండకపోవచ్చని స్వయంగా మార్క్ రుఫలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. సినిమాలో లేరు అంటే ఆయన్ని తొలగించారేమో! అని భావించి సోషల్ మీడియాలో ఇదే విష‌యాన్ని ప్రచారం చేశారు. నిజానికి అది కథలో మార్పుల వల్ల జరిగినదే తప్ప, ఆయనను తీసేయడం వల్ల కాదు. దీనిని చెప్పిన విధానం మిస్ క‌మ్యూనికేష‌న్ గా మారింది.

మార్క్ రుఫలోకు `స్పాయిలర్ కింగ్` అనే పేరుంది.. అంటే సినిమాల రహస్యాలను ముందే చెప్పేస్తారని సరదాగా అంటుంటారు. 2018లో ఆయన పొరపాటున ఒక సినిమా టైటిల్ లీక్ చేసినప్పుడు దర్శకులు రూసో బ్రదర్స్ సరదాగా ``మార్క్, యు ఆర్ ఫైర్‌డ్`` అని ట్వీట్ చేశారు. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ వివాదం నడుస్తుండటంతో ఎవరో ఆ పాత ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను ఇప్పుడు జరిగినట్లుగా షేర్ చేయడంతో జనం అది నిజమని నమ్మారు.

ప్ర‌తిభావంత‌డైన ర‌ఫ‌లో ఇంకా మార్వెల్‌లో భాగమే. 31 జూలై 2026న విడుదల కానున్న స్పైడ‌ర్ మ్యాన్-బ్రాండ్ న్యూ డే సినిమాలో ఆయన హల్క్ పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే అధికారికంగా ధృవీకరించారు.

భవిష్యత్తు ప్రాజెక్టులు

మార్క్ రుఫలో మార్వెల్ సినిమా ప్రపంచం (MCU) నుంచి తప్పుకోలేదు. 32 జూలై 2026న విడుదల కానున్న ఈ సినిమాలో మార్క్ రుఫలో `హల్క్`గా కనిపిస్తారని అధికారికంగా ధృవీకరించారు. అవెంజ‌ర్స్ డూమ్స్ డే సినిమాలో ఆయన తిరిగి ఎంట్రీ ఇస్తారు.