మనోజ్ 'డేవిడ్ రెడ్డి' బ్యూటీ.. స్పెషల్ వెపన్ తో ఇలా..
ప్రస్తుతం మరియా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాలో మంచు మనోజ్ బ్రిటిష్ దౌర్జన్యాలకు ఎదురు నిలిచిన యోధుడిగా ఆయన కనిపించనున్నారు.
By: M Prashanth | 6 March 2026 6:36 PM ISTరాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం డేవిడ్ రెడ్డి. దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఆ మూవీ స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సంఘటనల నేపథ్యంతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఓ ధైర్యవంతుడైన యోధుడి కథను సినిమాలో చూపించనున్నారు.
అయితే సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ చిత్రం ప్రిన్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన నటి మరియా ర్యబోషప్క నటిస్తోంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో మరియా స్పెషల్ డ్రెస్, క్యాప్ ధరించి వింటేజ్ కార్ ముందు నిల్చున్నట్లు కనిపించారు. చేతిలో ఒక ప్రత్యేక ఆయుధంతో కనిపిస్తూ ఆమె పాత్ర కూడా కథలో ముఖ్యంగా ఉండబోతుందని పరోక్షంగా వెల్లడించారు.
మరియా లుక్ ఇప్పుడు ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా "ఆమె ప్రేమ మృదువైనది కాదు... క్రూరమైనది. క్రూరమైన యుగానికి స్వాగతం" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం మరియా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాలో మంచు మనోజ్ బ్రిటిష్ దౌర్జన్యాలకు ఎదురు నిలిచిన యోధుడిగా ఆయన కనిపించనున్నారు.
ఇప్పటికే రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ఆ పోస్టర్ లో ఆయన యోధుడి లుక్ లో కనిపించారు. 1897 నుంచి 1922 మధ్య జరిగిన కథాంశంతో సినిమా సాగుతుందని, చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలను, బ్రిటిష్ పాలనలో జరిగిన దారుణాలను కథలో చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
స్వాతంత్ర్యం అడిగి కాదు, పోరాడి సాధించాలనే భావజాలంతో డేవిడ్ రెడ్డి పాత్రను దర్శకుడు తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా వార్ డాగ్ అనే బైక్ నిలవనుంది. దాదాపు 700 కిలోల బరువుతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆ బైక్ కథలో కీలక పాత్ర పోషించనుంది. ఆ బైక్ మంచు మనోజ్ పాత్రకు మరింత పవర్ ఇచ్చేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.
ఇక సినిమాను నిర్మాతలు వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ నటులు పార్తీబన్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్పెషల్ సాంగ్ లో మంచు మనోజ్ తో కలిసి యంగ్ బ్యూటీ రాశి ఖన్నా స్టెప్పులు వేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న డేవిడ్ రెడ్డి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
