Begin typing your search above and press return to search.

బ్రాండ్ వర్సెస్ బోర్.. మారి సెల్వరాజ్ ఎమోషనల్ కౌంటర్

రీసెంట్‌గా ధ్రువ్ విక్రమ్‌తో ఆయన తీసిన 'బైసన్' కూడా ఇదే రూట్‌లో వచ్చింది. సినిమాకు ఒకవైపు కాంట్రవర్సీలు ఉన్నా, కమర్షియల్‌గా సక్సెస్ అయింది.

By:  M Prashanth   |   26 Oct 2025 5:42 PM IST
బ్రాండ్ వర్సెస్ బోర్.. మారి సెల్వరాజ్ ఎమోషనల్ కౌంటర్
X

కోలీవుడ్‌లో కొందరు డైరెక్టర్ల మేకింగ్ విధానం ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాను టైమ్‌పాస్ కోసం, నవ్వించడం కోసం తియ్యరు. ఆడియెన్స్‌ను ఆలోచించేలా చేస్తారు. ఈ లీగ్‌కు మారి సెల్వరాజ్ కెప్టెన్ లాంటోడు. 'కర్ణన్' నుంచి 'మామన్నన్' వరకు, ఆయన సినిమాలన్నీ కుల అణచివేత లాంటి నిజాల చుట్టూనే తిరుగుతాయి. ఇదే ఆయన బ్రాండ్.

రీసెంట్‌గా ధ్రువ్ విక్రమ్‌తో ఆయన తీసిన 'బైసన్' కూడా ఇదే రూట్‌లో వచ్చింది. సినిమాకు ఒకవైపు కాంట్రవర్సీలు ఉన్నా, కమర్షియల్‌గా సక్సెస్ అయింది. అయితే, ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మారి సెల్వరాజ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు కొత్త రచ్చకు కారణం అయ్యాయి. "నన్ను దయచేసి మళ్లీ మళ్లీ ఒకే ప్రశ్న అడగకండి. 'ఎందుకు మీరు కులం గురించే సినిమాలు తీస్తారు?' అనే ప్రశ్న నన్ను చాలా బాధిస్తోంది. ఏడాదికి 300 ఫన్ సినిమాలు వస్తున్నాయి కదా, వాటిని ఎవరూ అడగరు. నా ఒక్క సినిమాను నా దారిలో వదిలేయండి" అంటూ ఆయన ఆవేదన చెందారు.

ఆయన చెప్పిన పాయింట్ వినడానికి కరెక్ట్‌గానే ఉన్నా, ఇది సోషల్ మీడియాలో, ముఖ్యంగా తమిళ్ ఆడియెన్స్‌లో కొందరికికి నచ్చలేదనే కామెంట్స్ వస్తున్నాయి. "ఓకే బ్రో, మీ పాయింట్ అర్థమైంది. కానీ ప్రతీ సినిమాలో ఒకే రకమైన కథ, అదే తరహాలో అణచివేత సీన్లు, అవే గొడవలు.. ఎన్నిసార్లు చూడాలి? ఇది మరీ పీక్స్‌కి వెళ్లిపోయింది. మాకు బోర్ కొడుతోంది" అనేది కొందరి ఆడియెన్స్ నుంచి వస్తున్న మెయిన్ కౌంటర్.

కొత్తలో ఈ తరహా సినిమాలు బాగానే ఉన్నప్పటికీ, ఇప్పుడు చాలా మందికి ఒక 'రొటీన్ ఫార్ములా'లా కనిపిస్తోంది. విమర్శలు కేవలం "బోరింగ్" దగ్గరే ఆగలేదు. కొంతమంది ఇంకో స్టెప్ ముందుకేసి ఆయన ఉద్దేశాన్నే తప్పుబడుతున్నారు. "మీరు నిజంగా సమాజంలో మార్పు తెద్దామనే ఇది చేస్తున్నారా? లేక, ఈ క్రియేటివిటీ ముసుగులో మీ 'పర్సనల్ ఎజెండా'ను, మీ కులాన్ని గొప్పగా చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారా?" అంటూ మరికొందరు అడుగుతున్నారు.

నిజానికి మారి సెల్వరాజ్ ఇప్పుడు ఒక క్లాసిక్ 'క్రియేటర్ ట్రాప్'లో పడ్డారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అతని కన్విక్షన్ ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. ఆ బ్రాండ్ వల్లే ఆయనకు మార్కెట్, సక్సెస్ వచ్చాయి. కానీ, ఇప్పుడు అదే బ్రాండ్ గురించి జనాలు మాట్లాడుతుంటే ఆయన హర్ట్ అవుతున్నారు. అయితే ఈ ఫార్ములా వదిలేస్తే, ఆయన్ను నమ్మిన కోర్ ఆడియెన్స్ దూరం కావచ్చు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక వదలకుంటే, జనరల్ ఆడియెన్స్ 'రొటీన్' అని తిప్పికొట్టే ప్రమాదం ఉంది. మరి ఈ కల్ట్ దర్శకుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి సినిమాలే చేస్తాడా లేదంటే మరో రూట్లో వెళతాడా అనేది చూడాలి.