Begin typing your search above and press return to search.

అల్ట్రా వయొలెన్ప్.. ఇంట్రెస్ట్ లేదు బాస్

ఏ ముహూర్తాన మలయాళంలో ‘మార్కో’ అనే సినిమా బ్లాక్ బస్టర్ అయిందో కానీ.. దాని ప్రభావం మిగతా ఇండస్ట్రీల మీద కూడా గట్టిగానే పడింది.

By:  Garuda Media   |   31 Oct 2026 8:23 PM IST
అల్ట్రా వయొలెన్ప్.. ఇంట్రెస్ట్ లేదు బాస్
X

ఏ ముహూర్తాన మలయాళంలో ‘మార్కో’ అనే సినిమా బ్లాక్ బస్టర్ అయిందో కానీ.. దాని ప్రభావం మిగతా ఇండస్ట్రీల మీద కూడా గట్టిగానే పడింది. తెలుగు సినిమాల్లో వయొలెన్స్ ఎప్పట్నంచో ఉన్నదే కానీ.. ఈ మధ్య అది మరీ శ్రుతి మించుతోంది. యాక్షన్ సీక్వెన్సుల్లో రక్తపాతం చూపించినా.. అది మరీ ఇంటెన్స్‌గా ఏమీ ఉండేది కాదు. ఫ్లాష్ కట్స్‌తో చూపించేసేవాళ్లు. కానీ ఈ మధ్య హింస అలా ఉండట్లేదు. మనిషి తల నరికితే అది ఎగిరి పడడం.. ఇటు మొండెం మీద, అటు తల మీద కెమెరా ఫోకస్ అవడం.. శరీరంలోని వేరేే అవయవాలు కూడా తెగిపడడం.. మనిషిని నిలువుగా, అడ్డంగా తెగ నరకడం.. ఇలాంటి విడ్డూరాలన్నీ చూస్తున్నాం.

‘ప్యారడైజ్’ సినిమాలో ఇలాంటి విపరీత హింసతో కూడిన సన్నివేశాలు చూసి జనాలకు కలిగిన ఫ్రస్టేషన్ అంతా ఇంతా కాదు. మరీ ఇంత జుగుప్సాకరంగా సన్నివేశాలను తీసి ఎవరిని మెప్పించాలనుకుంటున్నారన్నది అర్థం కాని విషయం. జెన్‌జీ కోసం ఇవి చేస్తున్నారేమో అనుకుంటే.. వాళ్లు కూడా ఈ తరహా సన్నివేశాలను అంతగా ఎంజాయ్ చేస్తున్నట్లేమీ కనిపించడం లేదు. యూత్ కూడా వీటిని సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నట్లే కనిపిస్తోంది.

‘రణబాలి’లో కూడా కొన్ని మితిమీరిన హింసాత్మక సన్నివేశాల పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇక లేటెస్ట్‌గా ‘ఆదర్శ కుటుంబం’లో కూడా హింస కొంచెం హద్దులు దాటిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పక్కా ఫ్యామిలీ సినిమాలో తల నరికి పడేసే సీన్ పెట్టారు. దాన్ని బ్లర్ చేసినా సరే.. ఆ షాట్ చూడ్డానికి అంత బాగా అనిపించలేదు. ఇక ‘ఆదర్శ కుటుంబం’ రిలీజైన రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్ట్’ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

‘కల్ట్’ టీజర్, ట్రైలర్ చూసే మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోయారంటే అతిశయోక్తి లేదు. ఇందులో హద్దులు దాటిన హింస సినిమా పరిధిని బాగా తగ్గించేసింది. హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్సేన్ స్వయంగా ఇది అందరికీ నచ్చే సినిమా కాదని చెప్పేశాడు. మరి నచ్చేవాళ్ల సంఖ్య ఏమాత్రం అని చూస్తే.. నిన్న రిలీజ్ రోజు థియేటర్లను చూస్తే విషయం అర్థమైపోయింది. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో డబుల్ డిజిట్లో టికెట్లు తెగిన థియేటర్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ఈ అల్ట్రా వయొలెంట్ మూవీ మీద జెన్‌జీ సైతం అంత ఆసక్తి చూపించలేదన్నది స్పష్టం.

ప్రసాద్స్, ఏఎంబీ లాంటి ఫేమస్ మల్టీప్లెక్సుల్లో మినహాయిస్తే మినిమం జనాలు కూడా లేరు. సినిమాలో అనుకున్న దాని కంటే హింస ఇంకా హద్దులు దాటిపోవడం, జీర్ణించుకోలేని సీన్లు ఉండడంతో వాటి పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఓవరాల్‌గా సినిమాకు కూడా అంత మంచి టాకేమీ లేదు. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల అనాసక్తిని గమనించి అయినా.. ఇక నుంచి తెలుగులో ఈ అల్ట్రా వయొలెంట్ కంటెంట్‌కు తెరదించితే బాగుటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.