Begin typing your search above and press return to search.

నాని వెనక్కి తగ్గేదేలే..!

ఈసారి సంక్రాంతికి ఐదు సినిమాల బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నాయి. ఇయర్ స్టార్టింగ్ లోనే ఇలా ఉంటే అదే శుభారంభంగా ఏడాది మొత్తం ఇలా క్రేజీ సినిమాల ఫైట్ కొనసాగేలా ఉంది.

By:  Ramesh Boddu   |   29 Dec 2025 10:33 AM IST
నాని వెనక్కి తగ్గేదేలే..!
X

ఈసారి సంక్రాంతికి ఐదు సినిమాల బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నాయి. ఇయర్ స్టార్టింగ్ లోనే ఇలా ఉంటే అదే శుభారంభంగా ఏడాది మొత్తం ఇలా క్రేజీ సినిమాల ఫైట్ కొనసాగేలా ఉంది. ఇదే క్రమంలో ఫిబ్రవరి లో వాలెంటైన్స్ డే కి సినిమాల పోటీ ఉండబోతుంది. రేసులో ఫంకీతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక మరోపక్క మార్చిలో రెండో వారం నుంచి సమ్మర్ సినిమాల సందడి షురూ కాబోతుంది. మార్చి 17న యష్ టాక్సిక్ నుంచి అడివి శేష్ డెకాయిట్ ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

రెండు సినిమాలు రెండు డిఫరెంట్ స్టోరీస్..

ఐతే మార్చి మంత్ ఎండ్ 26న న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుండగా ఆ నెక్స్ట్ డే అదే మార్చి 27న గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్నాయి. ఐతే ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారుతుంది. నాని ది ప్యారడైజ్ ని ముందే మార్చ్ 26కి రిలీజ్ అని ఫిక్స్ చేసుకున్నాడు. SLV బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

పెద్ది సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నారు. బడ్జెట్ పరంగా ఇమేజ్ పరంగా చూస్తే పెద్ది భారీగా ఉండబోతుంది. ఈ క్రమంలో నాని ది ప్యారడైజ్ ఏమైనా వాయిదా పడుతుందా అన్న చర్చ మొదలైంది. ఐతే పెద్ది పోటీలో ఉన్నా లేకపోయినా ది ప్యారడైజ్ మాత్రం అనుకున్న డేట్ కే వస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. పెద్దితో ఫైట్ కి డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా రెడీ అనేస్తున్నారు ది ప్యారడైజ్ టీం.

నాని ది ప్యారడైజ్, చరణ్ పెద్ది ఫైట్..

నాని కూడా సినిమాను వాయిదా వేయడానికి అసలు ఆసక్తిగా లేరని టాక్. రెండు సినిమాలు ఒకేసారి వచ్చి ఆ రెండు సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఐతే ఈసారి నాని ది ప్యారడైజ్, చరణ్ పెద్ది ఫైట్ క్రేజీగా ఉండబోతుంది. ఈ రెండు సినిమాల దర్శకులు శ్రీకాంత్ ఓదెల, బుచ్చి బాబు కూడా తమ తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని రెండో సినిమాను దానికి మించి క్రేజీ కాంబినేషన్ తో వస్తున్నారు.

చివరి నిమిషంలో ఏదైనా జరిగి ఆ రెండిటిలో ఏ సినిమా అయినా సమ్మర్ కి అంటే మే చివరికి ఏమైనా వయిదా పడుతుందేమో కానీ ఇప్పటికైతే నాని ది ప్యారడైజ్, చరణ్ పెద్ది రెండు కూడా మార్చి 26, 27 తేదీలకు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఈ ఫైట్ ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

క్లారిటీ వస్తుంది. రెండు సినిమాలు మాత్రం ప్రమోషనల్ కంటెంట్ తోనే సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. పెద్ది ఫస్ట్ షాట్ తో బీభత్సం సృష్టించగా ది ప్యారడైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ తోనే గూస్ బంప్స్ తెప్పించారు. మరి ఈ సినిమాలు నిజంగానే ఒకే టైంలో వస్తే రెండిటి మధ్య టఫ్ ఫైట్ జరిగేలా ఉంది.