Begin typing your search above and press return to search.

ది ప్యారడైజ్.. ఆలస్యం అమృతమే..

టాలీవుడ్‌లో 2026 మార్చి నెల అనేది ఇప్పుడు నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక టెన్షన్ అయితే కలిగించింది.

By:  M Prashanth   |   10 Oct 2025 10:00 AM IST
ది ప్యారడైజ్.. ఆలస్యం అమృతమే..
X

టాలీవుడ్‌లో 2026 మార్చి నెల అనేది ఇప్పుడు నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక టెన్షన్ అయితే కలిగించింది. అగ్ర హీరోలైన రామ్ చరణ్ 'పెద్ది' (మార్చి 27), నాని 'ది ప్యారడైజ్' (మార్చి 26) ఒకే వారం విడుదల కాబోతున్నట్లు క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. రెండు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా రెండు వైపులా నిర్మాతలు సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎటు తిరిగి డిస్ట్రిబ్యూటర్స్ కు ఇది పెద్ద రిస్క్.

గతంలో ఇలాంటి క్లాష్‌లు బాక్సాఫీస్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించాయి. అందుకే, ఇప్పుడు ఇద్దరు నిర్మాతలలో ఒకరితో ఒకరు చర్చించుకుని, భద్రత కల్పించుకోవాల్సిన సమయం వచ్చింది. ​బిజినెస్ కోణం నుంచి చూస్తే, ఇలాంటి క్లాష్ జరిగితే ఏదో ఒక సినిమాకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. టాక్ బాగున్నా ఇంపాక్ట్ చూపే ప్రమాదం ఉంది. చరణ్ 'పెద్ది' సినిమా భారీ బడ్జెట్, పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్. దీనిపై పెట్టిన పెట్టుబడికి రికవరీ కావాలంటే, థియేటర్లలో పూర్తి సోలో రన్ అవసరం.

అదే సమయంలో నాని సినిమా కూడా రావడంతో, థియేటర్ల పంపకం, కలెక్షన్ల విభజన వంటి ఇబ్బందులు తప్పవు.

​ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ 60% పూర్తై, నిర్మాణ పరంగా సేఫ్ జోన్‌లో ఉంది. దర్శకుడు బుచ్చిబాబు సానా పక్కా ప్లానింగ్‌తో మార్చి 27 డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను ఆలస్యం చేయడం అనేది నిర్మాతలకు ఆర్థికంగా, కమర్షియల్‌గా నష్టం తెస్తుంది. అందుకే, ఈ సినిమా షెడ్యూల్‌ను మార్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

​మరోవైపు, నాని 'ది ప్యారడైజ్' పరిస్థితి భిన్నంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఒదెల పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి మొదలు కాకపోవడం, షూటింగ్ కూడా స్లోగా సాగడం వల్ల మార్చి 26 రిలీజ్ డేట్ అందుకోవడం కష్టమే అనే టాక్ ఉంది. ఈ ఆలస్యం వల్ల, నిర్మాతకు మాత్రమే కాకుండా రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ కు అమృతమే అని చెప్పవచ్చు.

​ఆలస్యం అవుతున్నప్పటికీ, ఒక సేఫ్ డేట్ చూసుకొని సినిమాను విడుదల చేస్తే, పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, 'ది ప్యారడైజ్' రిలీజ్ డేట్‌ను కొన్ని నెలలు వెనక్కి జరపడం నిర్మాతలకు ఒక సేఫ్టీ బ్రేక్ అవుతుంది. హడావిడిగా వచ్చి, మరో పెద్ద సినిమాతో పోటీ పడి, కలెక్షన్లను రిస్క్‌లో పెట్టడం కంటే, ఆలస్యంగా వచ్చి సోలో విన్నర్‌గా నిలబడటం ఉత్తమం. ​మొత్తానికి, ఈ క్లాష్ ఇద్దరు హీరోలకు మార్కెట్ డిమాండ్‌ను పెంచుతుంది కానీ, నిర్మాతలకు మాత్రం పెద్ద సవాలు. రామ్ చరణ్ 'పెద్ది' తన డేట్‌కే నిలబడే అవకాశం ఉంది కాబట్టి, నాని 'ది ప్యారడైజ్' నిర్మాతలే తమ పెట్టుబడి భద్రత కోసం ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక త్వరలోనే న్యూ డేట్ విషయంలో అఫీషియల్ అప్డేట్ రావచ్చు.