'బ్రహ్మకుమారీస్'పై బాలీవుడ్ నటి ఆరోపణలు
ఈ ఆరోపణలపై సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి వివాదాల సమయంలో వారు మౌనాన్ని పాటిస్తూ, చట్టపరమైన చర్యల వైపు మొగ్గు చూపుతుంటారు.
By: Sivaji Kontham | 14 Jan 2026 5:00 AM ISTమరాఠీ నటి పల్లవి పాటిల్ బ్రహ్మకుమారీస్ సంస్థపై చేసిన సంచలన ఆరోపణలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా `హిడెన్ వీడియో`లతో తనను ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసారని ఆరోపించారు. పల్లవి పాటిల్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేస్తూ, బ్రహ్మకుమారీస్ సంస్థలో కొన్ని అసాధారణమైన కలవరపరిచే విషయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సంస్థలోని ప్రైవేట్ ప్రదేశాలలో రహస్య కెమెరాలు ఉన్నాయని, అక్కడి వ్యక్తుల వ్యక్తిగత కార్యకలాపాలను రికార్డ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆధ్యాత్మికత పేరుతో భక్తులపై మానసిక ఒత్తిడి తెస్తున్నారని, వారి వ్యక్తిగత జీవితాలను నియంత్రిస్తున్నారని పేర్కొన్నారు. తాను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని, అందుకే బయటకు వచ్చి ఇవన్నీ చెప్తున్నానని ఆమె వెల్లడించారు.
అయితే సదరు నటీమణి చేసిన ఈ ఆరోపణలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి ఘటనను విశ్లేషిస్తున్నారు. ఎంతో కాలంగా ఇలాంటి ఆరోపణలు వింటున్నాం, పల్లవి ధైర్యంగా ముందుకు రావడం అభినందనీయం అని కొందరు మద్దతు తెలుపుతున్నారు. బ్రహ్మకుమారీస్ అనుచరులు మాత్రం ఇవి కేవలం ప్రచారం కోసమే చేస్తున్న ఆరోపణలని, లక్షలాది మందికి శాంతిని ఇచ్చే సంస్థను అప్రతిష్ట పాలు చేయవద్దని కోరుతున్నారు. ఒకవేళ బ్రహ్మకుమారీస్ లో ఒక వ్యక్తి చేసిన తప్పును అందరికీ ఆపాదించడం లేదా జనరలైజ్ చేయడం సరికాదని మెజారిటీ ఫాలోవర్స్ సూచిస్తున్నారు. సంస్థ అధిపతులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా తననే తిరిగి వారంతా బెదిరించారని పల్లవి జోషి ఆరోపించారు. అయితే దానిని నిరూపించాల్సి ఉంటుందని కొందరు సూచించారు.
ఈ ఆరోపణలపై సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి వివాదాల సమయంలో వారు మౌనాన్ని పాటిస్తూ, చట్టపరమైన చర్యల వైపు మొగ్గు చూపుతుంటారు.
ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలు ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు అది జాతీయ స్థాయిలో వార్తగా మారుతుంది.పల్లవి పాటిల్ చేసిన ఈ హిడెన్ వీడియోస్ ఆరోపణ నిజమని తేలితే అది ప్రతిష్ఠాత్మక బ్రహ్మకుమారీస్ కి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అయితే దీనిపై పోలీసులు విచారణ జరిపి నిజాన్ని బయటపెట్టాల్సి ఉంది. బ్రహ్మ కుమారీస్ పై గతంలో ఓ తెలుగు యువతి తీవ్ర ఆరోపణలు చేసారు. చాలా కాలం ఈ సంస్థలో పని చేసాక కొందరు గురువుల స్థానంలో ఉన్నవారు సరిగా లేరని ఆరోపించారు. ఆపై ఈ అంశంపై టీవీ చానెళ్లలో చాలా డిబేట్లు నడిచాయి. అయితే బ్రహ్మకుమారీస్ ని ప్రారంభించిన వ్యవస్థాపక ఆధ్యాత్మిక గురువుల ఉద్ధేశం శాంతిని, మంచిని భోధించడం. కానీ మధ్యలో చేరిన కొందరు మానవమాత్రులు చేసే చెడు పనులు కొన్నిసార్లు ఇలాంటి ఔట్ బరస్ట్ గా మారుతుంటాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
