స్టార్ హీరో మేనేజర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
ఈ రోజుల్లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సర్వసాధారణంగా మారాయి. రంగుల ప్రపంచంలో ఏదో ఒక చోట వేధింపుల ప్రహసనం గురించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
By: Sivaji Kontham | 18 Nov 2025 6:18 PM ISTఈ రోజుల్లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సర్వసాధారణంగా మారాయి. రంగుల ప్రపంచంలో ఏదో ఒక చోట వేధింపుల ప్రహసనం గురించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనేజర్ శ్రేయాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. అతడు కమిట్ మెంట్ అడిగాడంటూ టీవీ నటి మాన్య ఆనంద్ ఆరోపించారు.
అతడు చాలా కాలంగా `అడ్జస్ట్‌మెంట్` గురించి అడుగుతున్నాడు. ధనుష్ నటించే కొత్త ప్రాజెక్టులో అవకాశం కల్పిస్తానంటూ అతడు నన్ను పిలిచి కొన్ని అభ్యంతరకరమైన అభ్యర్థనలు కూడా చేశాడని ఆమె పేర్కొంది. కమిట్మెంట్ కావాలని శ్రేయాస్ అడిగారు! అని ఆరోపించారు. ``ఏ కమిట్మెంట్? నేను ఎందుకు కమిట్మెంట్ ఇవ్వాలి`` అని తాను అతడిని ఎదురు ప్రశ్నించినట్టు కూడా నటి మాన్య వెల్లడించారు.
ఆఫర్లు నాకు అవసరం లేదని చెప్పినా అతడు తనను బలవంతం చేస్తూనే ఉన్నాడని కూడా మాన్య ఆరోపించారు. ధనుష్ అయినా మీరు అంగీకరించరా? అని అడిగాడట. దీంతో పాటు ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్ వివరాలను కూడా శ్రేయాస్ తనకు పంపాడని తనను కలవమని కోరాడని మాన్య పేర్కొంది. అతడు స్క్రిప్టులు కూడా పంపాడు. కానీ నేను చదవలేదు.
``మేం ఆర్టిస్టులు మాత్రమే. నటులగా పని చేస్తున్నాం. మీరు మానుండి పనిని మాత్రమే తీసుకోండి. వేరే ఏదీ కోరవద్దు. మీ డిమాండ్లకు తలవొంచితే మమ్మల్ని వేరే పేరు పెడతారు!`` అని కూడా తాను ధనుష్ మేనేజర్ శ్రేయాస్ తో అన్నట్టు తెలిపింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని కూడా ఆమె సున్నితంగా సూచించారు. అయితే ధనుష్ లేదా శ్రేయాస్ ఇప్పటివరకు ఈ వాదనలకు స్పందించలేదు.
ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్ మే రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి సనోన్ కథానాయిక. ఈ సినిమా రాంజానా తరహాలో ఉండదని దర్శకుడు చెబుతున్నారు. దీనికి హిమాన్షు శర్మ- నీరజ్ యాదవ్ రచయితలు. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కాలంతో పాటే మారే ప్రేమను తెరపై చూపిస్తున్నామని ఆనంద్ ఎల్ .రాయ్ చెబుతున్నారు. `తేరే ఇష్క్ మే` 28 నవంబర్ 2025న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషలలో థియేటర్లలోకి రానుంది.
