Begin typing your search above and press return to search.

మాజీ ప్ర‌పంచ సుంద‌రి పూల్ సైడ్ ట్రీట్

ఈ బ్యూటీ పూల్ సైడ్ స్విమ్ సూట్ లో ఫోజులిచ్చిన కొన్ని ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

By:  Sivaji Kontham   |   11 Nov 2025 9:35 AM IST
మాజీ ప్ర‌పంచ సుంద‌రి పూల్ సైడ్ ట్రీట్
X

చాలా మంది అందాల పోటీట్లో రాణించిన‌ `మిస్సు`లు సినీరంగంలో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. మోడ‌లింగ్, సినీరంగంలో రాణించ‌డ‌మే ధ్యేయంగా అందాల రాణుల ప్ర‌య‌త్నాల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. గ్లామ‌ర్ రంగంలో అదృష్టం క‌లిసొస్తే ఆర్జ‌న ఆకాశాన్ని అంటుతుంది. సంప‌ద‌ల‌కు కొద‌వేమీ ఉండ‌దు. ఐశ్వ‌ర్యారాయ్, సుస్మితా సేన్, దియా మీర్జా, ప్రియాంక చోప్రా.. ఇలా అందాల పోటీల నుంచి గ్లామ‌ర్ రంగంలోకి వ‌చ్చిన వారి జాబితా చాలా పెద్ద‌దే.




ఈ జాబితాలోనే మాజీ ప్ర‌పంచ సుంద‌రి మానుషి చిల్ల‌ర్ కూడా ఉంది. కానీ అదృష్టం ఏనాడూ మానుషి ఇంటి త‌లుపు త‌ట్టిన‌ట్టు క‌నిపించ‌దు. సినీన‌టిగా కెరీర్ ప్రారంభించి ద‌శాబ్ధం అవుతున్నా ఇప్ప‌టికీ స‌రైన బ్రేక్ లేక ట్ర‌బుల్స్ లోనే ఉంది. అయితే న‌టిగా అవాకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా, మోడ‌ల్ గా మానుషి బాగానే ఆర్జిస్తోంది.




2015 నుంచి ప్ర‌య‌త్నిస్తున్నా, 2022లో త‌న కెరీర్ కి బ్రేక్ నిచ్చే అవ‌కాశం అందుకుంది మానుషి చిల్ల‌ర్. అక్ష‌య్ స‌ర‌స‌న `సామ్రాట్ పృథ్వీరాజ్` చిత్రంతో కెరీర్ ప్రారంభించినా కానీ, అంత‌కుముందు మానుషి ఐదారేళ్లుగా సినీరంగంలో స్ట్ర‌గుల్ ని ఎదుర్కొంటూనే ఉంది. అవ‌కాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. అమీర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ లాంటి స్టార్ల‌తో నటించాల‌ని క‌ల‌లు కంది. కానీ చివ‌రికి ఖిలాడీ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. ఆరంగేట్రం పెద్ద హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకున్నా కానీ, అప్ప‌టికే క‌రోనా క్రైసిస్ కార‌ణంగా ఆ సినిమా ఆల‌స్య‌మ‌వుతూ చివ‌రికి రిలీజైంది. విడుద‌లైనా ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. చివ‌రికి మానుషి డెబ్యూ క‌ల‌లు కూడా చిద్ర‌మ‌య్యాయి. చాలా మంది ప్ర‌పంచ సుంద‌రీమ‌ణుల‌కు ఎదురుకాని ప‌రిస్థితి మానుషికి ఎదురైంది.




ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ, బ‌డే మియాన్ చోటే మియాన్ లాంటి భారీ చిత్రాలు కూడా డిజాస్ట‌ర్లుగా మార‌డంతో మానుషికి సినీరంగం అంత‌గా క‌లిసి రాద‌ని ప్రూవైంది. ఈ భామ ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్ లోను అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న `ఆప‌రేష‌న్ వేలంటైన్` చిత్రంలో న‌టించింది. కానీ ఈ సినిమా ఆశించిన విజ‌యం ద‌క్కించుకోలేకపోవ‌డంతో మానుషి చాలా నిరాశ‌ను ఎదుర్కొంది. అయినా సినీరంగంలో త‌న ప్ర‌య‌త్నాల‌ను ఆప‌లేదు. 2025లో మాలిక్, టెహ్రాన్ అనే రెండు చిత్రాల‌లో న‌టించింది. మాలిక్ లో రాజ్ కుమార్ రావు, టెహ్రాన్ లో జాన్అబ్ర‌హాం క‌థానాయ‌కులుగా న‌టించారు. ఈ రెండు చిత్రాల్లో మాలిక్ ఫ్లాప‌వ్వ‌గా, టెహ్రాన్ యావ‌రేజ్ గా ఆడింది. ప్ర‌స్తుతం మానుషి త‌దుప‌రి చిత్రం కోసం వేచి చూస్తోంది.

మ‌రోవైపు మానుషి చిల్ల‌ర్ సోష‌ల్ మీడియాల్లోను చాలా యాక్టివ్ గా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఈ బ్యూటీ పూల్ సైడ్ స్విమ్ సూట్ లో ఫోజులిచ్చిన కొన్ని ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. కొంద‌రు స్నేహితురాళ్ల‌తో క‌లిసి మానుషి రిసార్ట్ పార్టీలో ఫుల్ గా చిల్ అవుతున్న ఫోటోలు కూడా ఈ బంచ్ లో క‌నిపించాయి. మానుషి పూల్ సైడ్ ట్రీట్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో హీట్ పుట్టిస్తోంది. పూల్ సైడ్ ప్ర‌పంచ సుంద‌రి సూప‌ర్భ్! అంటూ అభిమానులు మానుషికి కి కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వెబ్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.