Begin typing your search above and press return to search.

మానుషి స్ట‌న్నింగ్ బ్లాక్ బికినీ మేకోవ‌ర్

మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి (2017) కిరీటం గెలుచుకున్న తర్వాత బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగుతుందని అందరూ భావించారు. కానీ ఈ అందాల భామ‌ సినీ ప్రయాణం ఆశించినంత వేగంగా సాగలేదు.

By:  Sivaji Kontham   |   25 Feb 2026 12:00 AM IST
మానుషి స్ట‌న్నింగ్ బ్లాక్ బికినీ మేకోవ‌ర్
X

మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి (2017) కిరీటం గెలుచుకున్న తర్వాత బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగుతుందని అందరూ భావించారు. కానీ ఈ అందాల భామ‌ సినీ ప్రయాణం ఆశించినంత వేగంగా సాగలేదు. ఐశ్వ‌ర్యారాయ్, సుస్మితాసేన్ రేంజులో షైన్ అవ్వ‌డంలో ఈ బ్యూటీ విఫ‌ల‌మైంది.




ఒక ర‌కంగా మానుషి దుర‌దృష్ట నాయిక అని అనాలి. మానుషి సినీఆరంగేట్రం చేసే స‌మ‌యంలోనే క‌రోనా క్రైసిస్ ముంచుకొచ్చింది. త‌న మొద‌టి పెద్ద అవ‌కాశం వ‌చ్చేప్ప‌టికి క‌రోనా రంగ ప్ర‌వేశం చేసి ఆశ‌ల్ని అడియాశ‌ల్ని చేసింది. త‌ను న‌టించిన క్రేజీ సినిమా విడుద‌ల కావ‌డానికి ఏళ్లు ప‌ట్టింది. దానికి తోడు ప‌రాజ‌యం వెక్కిరించింది. మొత్తానికి అందాల భామ‌ల్లో అదృష్టం క‌లిసి రాని న‌టిగా మిగిలిపోయింది.




అయితే మానుషి త‌న‌ను తాను నిల‌బెట్టుకునేందుకు, స్టార్ గా లైమ్ లైట్ లో ఉండేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు, హార్డ్ వ‌ర్క్ గురించి ప్ర‌శంసించి తీరాలి. ఈ బ్యూటీ నిరంత‌రం కాంపిటీష‌న్ లో నెగ్గేందుకు ఇత‌ర భామ‌ల్లానే సోష‌ల్ మీడియాల్లో వేగంగా ఉంది. మానుషి ఇన్ స్టాలో నిరంత‌రం ఫోటోల‌ను షేర్ చేస్తుంటే అవి వైర‌ల్ గా మారుతున్నాయి. మానుషి తన బ్లాక్ బికినీ ఫోటోలను షేర్ చేసి వాటికి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది. ''నేను చాలా ఫన్నీగా ఉంటాను.. కానీ నేను మంచి లైటింగ్‌ను గౌరవిస్తాను'' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ వెబ్‌లో గుబులు పుట్టిస్తోంది.




సాధారణంగా మోడల్స్ లేదా నటీమణుల ఫోటో షూట్లలో చాలా సీరియస్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తారు. దీనివల్ల వారు వ్యక్తిగతంగా కూడా చాలా సీరియస్ గా ఉంటార‌ని జనం అనుకుంటారు. కానీ మానుషి ఈ క్యాప్షన్ తో సందేహాన్ని ప‌టాపంచ‌లు చేసింది. నేను నిజానికి చాలా సరదా మనిషిని, కానీ మంచి లైటింగ్ ఉన్నప్పుడు దాని విలువ తెలిసిన దానిగా ఇలా గ్లామరస్ పోజులు ఇస్తున్నాను! అని చమత్కరించింది. అంటే తన అందం వెనుక లైటింగ్ పాత్రను కూడా అంగీకరిస్తూ తనలోని హ్యూమర్ సెన్స్‌ను బయటపెట్టింది.

తదుపరి చిత్రాలు - వెబ్ సిరీస్‌ల వివ‌రాలు:

మానుషి కెరీర్‌లో `పృథ్వీరాజ్`, `ఆపరేషన్ వాలెంటైన్`, `బడే మియాన్ చోటే మియాన్` వంటి భారీ చిత్రాలు నిరాశపరిచినా కానీ, ప్ర‌స్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో న‌టిస్తోంది. జాన్ అబ్రహం సరసన నటించిన టెహ్రాన్ గ‌త ఏడాది విడుద‌లైంది. కానీ మానుషికి ప్ల‌స్ కాలేదు. యాక్షన్ కామెడీ-క్రైమ్ చిత్రం `వెల్‌కమ్ టు ది జంగిల్`లో ఒక పాత్ర పోషించింది. `నో ఎంట్రీ 2`, `రేస్ 4: రీలోడెడ్`లలో కనిపించనుంది.

మానుషి చిల్లర్ డిజిటల్ లోను ఎంట్రీ ఇవ్వబోతోంది. నెట్‌ఫ్లిక్స్ కోసం నిర్మిస్తున్న ఒక భారీ పీరియడ్ డ్రామా లేదా థ్రిల్లర్ సిరీస్‌లో ఆమె నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలతో ట‌చ్ లో ఉంద‌ని స‌మాచారం.

మానుషి `షైన్` అవ్వాలంటే..?

మిస్ వరల్డ్ కావడమే మానుషికి పెద్ద గుర్తింపు, కానీ నటిగా నిలదొక్కుకోవాలంటే కొన్ని మార్పులు అవ‌స‌రం. ఈ బ్యూటీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించాలి. స్టార్ హీరోల పక్కన కేవలం సాంగ్స్ కోసం కాకుండా, సందీప్ రెడ్డి వంగా లేదా సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల సినిమాల్లో చిన్న పాత్రలైనా చేస్తే ఆమెలోని యూనిక్ క్వాలిటీ బయటపడుతుంది. ఫోటోషూట్లు సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచుతున్నాయి. కానీ కావాల్సింది ఒక సాలిడ్ హిట్.. ఆ ఒక్క బ్లాక్ బస్టర్ పడితే మానుషి రేంజ్ మారిపోతుంది.