Begin typing your search above and press return to search.

సినిమాలకు ప్రతిభావంతులు అక్కర్లేదా...?

తాజాగా వెబ్‌ సిరీస్‌ల గురించి ఓటీటీ కంటెంట్‌ గురించి ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Ramesh Palla   |   30 Aug 2025 8:00 PM IST
సినిమాలకు ప్రతిభావంతులు అక్కర్లేదా...?
X

సినిమాలకు వెబ్‌ సిరీస్‌లు ప్రత్యామ్నాయంగా మారుతాయని పదేళ్ల క్రితం వరకు ఎవరూ ఊహించలేదు. కానీ సినిమాలను మించి వెబ్‌ సిరీస్‌లు ఇప్పుడు వస్తున్నాయి. ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌లు మాత్రమే కాకుండా హిందీ, మన సౌత్‌ ఇండియన్‌ భాషల్లోనూ సినిమాలను మించి టెక్నికల్‌ వ్యాల్యూస్‌, ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో వెబ్‌ సిరీస్‌లను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. వెబ్‌ సిరీస్‌ లు స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే ఏ స్థాయిలో ఆ వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మద్య కాలంలో హిందీతో పాటు, అన్ని భాషల వెబ్‌ సిరీస్‌లు ఇండియాలో పెద్ద ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అంతే కాకుండా మంచి కంటెంట్‌ ఉంటే అన్ని భాషల్లోనూ మంచి ఆధరణ సొంతం చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

మనోజ్‌ బాజ్‌పేయీ షాకింగ్‌ వ్యాఖ్యలు

తాజాగా వెబ్‌ సిరీస్‌ల గురించి ఓటీటీ కంటెంట్‌ గురించి ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్‌లో విడుదల అవుతున్న సినిమాల్లో చాలా వరకు అందులోని నటీనటులు ఎవరు? కథ ఏంటి అనేది కూడా చూడకుండా హిట్‌ చేస్తున్నారు. సినిమాల్లో నటించే నటీనటులు ప్రతిభావంతులు కానక్కర్లేదు. ప్రతిభ లేకుండానే సినిమాలతో హిట్‌ సాధిస్తున్నారు అంటూ మనోజ్ బాజ్‌పేయీ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ కంటెంట్‌ లో నటించే వారు మాత్రం చాలా గొప్ప ప్రతిభావంతులు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమా థియేటర్‌ల ద్వారా వచ్చిన వారితో పోల్చితే ఓటీటీ ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారు ఎక్కువ ప్రతిభావంతులు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలకు అర్థం వస్తుంది.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు

గత ఏడు సంవత్సరాలుగా తాను ఈ విషయాన్ని గమనిస్తున్నాను అంటూ మనోజ్ బాజ్‌పేయీ అంటున్నారు. మంచి కంటెంట్‌ తో వచ్చిన వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. మంచి నటీనటులకు గుర్తింపు, గౌరవం దక్కుతుంది. ప్రతిభను చూపించేందుకు ఒక మంచి వేదిక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నిలుస్తుంది. తాను చేసిన ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ రెండు సీజన్‌లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకు కారణం మంచి కంటెంట్‌ ఉండటం అనడంలో సందేహం లేదు. ఇతర వెబ్‌ సిరీస్‌లు సైతం మంచి కంటెంట్‌తో వస్తే ఖచ్చితంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా ప్రతిభావంతులు అయిన వారు నటించిన సిరీస్‌లు మంచి స్పందన దక్కించుకుంటున్నాయి. అందుకే ఓటీటీ వల్ల ఎంతో మంది ప్రతిభావంతులు గుర్తింపు, గౌరవం పొందుతున్నారని మనోజ్ బాజ్‌పేయీ అన్నారు.

మనోజ్‌ బాజ్‌పేయి వెబ్‌ సిరీస్‌లు

ఓటీటీల వల్ల చాలా మంది నటీనటులు సాంకేతిక నిపుణులు ప్రయోజనం పొందుతున్నారు. ఎక్కువగా ప్రయోజనం పొందిన వారిలో తాను ఒకడిని అన్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా పెద్దగా ఆఫర్లు దక్కలేదు, వచ్చిన చిన్నా చితకా ఆఫర్లతో కెరీర్‌ లో ముందుకు సాగలేక పోయిన మనోజ్ బాజ్‌పేయీ ఎప్పుడైతే ఓటీటీల ప్రభావం పెరిగిందో అప్పటి నుంచి వరుసగా వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు మూడు వెబ్‌ సిరీస్‌ లు స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. మరికొన్ని వెబ్‌ సిరీస్‌ల్లోనూ మనోజ్‌ బాజ్‌పేయీ నటించబోతున్నాడు. నటుడిగా తనను తాను నిరూపించుకుంటూ వెళ్తున్న మనోజ్‌ బాజ్‌పేయీ కి సినిమాల్లో దక్కని స్టార్‌డం వెబ్‌ సిరీస్‌ల కారణంగా దక్కింది. అంత మాత్రాన సినిమాల్లో ఉన్న వారు ప్రతిభావంతులు కారు అని అనడం కరెక్ట్‌ కాదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.