PR స్టంట్‌పై విరుచుకుపడ్డ జాతీయ ఉత్తమ నటుడు
పబ్లిసిటీలో పీఆర్ స్టంట్ కారణంగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నటులకు అవమానం ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్ పాయ్
By: Sivaji Kontham | 14 Sept 2025 5:00 AM ISTపబ్లిసిటీలో పీఆర్ స్టంట్ కారణంగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నటులకు అవమానం ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్ పాయ్. నిన్న గాక మొన్న వచ్చిన నటులను నేషనల్ క్రష్ అంటూ ఉత్తమ నటుడు అంటూ ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి పీఆర్ స్టంట్ కారణంగా వాస్తవంగా ఉత్తమ నటులు మరుగున పడుతున్నారని విమర్శించారు భాజ్ పాయ్.
తాను ఏదైనా సినిమాలో గొప్ప ప్రదర్శన ఇచ్చానని అనిపించినప్పుడల్లా, పిఆర్‌వోలు మరొక నటుడిని `ఉత్తమ నటుడు` అని లేదా `నేషనల్ క్రష్` అని పిలుస్తున్నారని ఆయన అన్నారు. ఈ తరహా నటుల కారణంగా తాను కానీ, తనలాంటి సీనియర్ పీయుష్ మిశ్రా లాంటి వారు అవమానాలు ఎదుర్కొంటున్నామని అన్నారు. నటనా వృత్తిలో శిక్షణ పొంది కూడా ఇలాంటి పరిస్థితి వస్తోందని మనోజ్ భాజ్ పాయ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ తరహా ప్రచార స్టంట్ చికాకు కలిగించే అవమానకరమైన వ్యవహారమని అన్నారు. పియూష్ మిశ్రాను ఉదాహరణగా చూపిస్తూ, ``నటుడిగా శిక్షణ పొంది, చాలా సంవత్సరాలుగా నటిస్తున్న అతనికి ఇది అవమానకరం`` అని అన్నాడు. దీనికి అనురాగ్ కశ్యప్ నుండి ప్రతిస్పందన వచ్చింది.
అయితే నేషనల్ క్రష్ ట్యాగ్ పై మనోజ్ భాజ్ పాయ్ విరుచుకుపడటంతో అది కచ్ఛితంగా రష్మిక మందన్నను దృష్టిలో ఉంచుకుని అన్నారని అంతా భావించారు. రష్మిక ఇటీవల అదే పేరుతో ఒక పెర్ఫ్యూమ్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ షిట్ .. ఇది చాలా బూటకం. ఇది ఎవరికైనా.. ప్రతి ఒక్కరికీ ఉపయోగిస్తున్నారు! అని రాసారు.
నటుల ఇమేజ్ ని పెంచేందుకు పీఆర్వోలను కొనుగోలు చేయడం నిజంగా ప్రమాణిక నటులకు వినాశకరమైనదని మనోజ్ భాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. మనోజ్ భాజ్ పాయ్ స్థిరపడిన నటుడు. అందువల్ల ఫిల్టర్ లెస్ గా ప్రతిదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పీఆర్వోల పబ్లిసిటీ స్టంట్ ని కూడా ఆయన విమర్శించారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే..... మనోజ్ బాజ్‌పేయి ప్రస్తుతం `జుగ్నుమా - ది ఫేబుల్`లో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా మరో భారీ ప్రయోగాత్మక చిత్రం.
