మనోజ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషనా?
బాలీవుడ్‌లో క్యారెక్టర్ కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకునే నటులు చాలా మందే ఉన్నా.. ప్రతి పాత్రలో ఆడియన్స్ కు నటుడు కనిపించకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించే స్థాయికి వెళ్లగలిగేవారు మాత్రం కొందరే
By: Sravani Lakshmi Srungarapu | 7 Sept 2026 2:17 PM ISTబాలీవుడ్‌లో క్యారెక్టర్ కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకునే నటులు చాలా మందే ఉన్నా.. ప్రతి పాత్రలో ఆడియన్స్ కు నటుడు కనిపించకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించే స్థాయికి వెళ్లగలిగేవారు మాత్రం కొందరే. అలాంటి అరుదైన నటుల్లో మనోజ్ బాజ్‌పాయ్ పేరు ముందుంటుంది. ఇప్పుడు ఆయన కెరీర్‌లో మరో భారీ ఛాలెంజ్‌తో కూడిన క్యారెక్టర్ కు సిద్ధమవుతున్నారన్న డిస్కషన్ సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మనోజ్ బాజ్‌పాయ్ కెరీర్‌ను ఒక్కసారి పరిశీలిస్తే ప్రతి దశలో ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న సందర్భాలు కనిపిస్తాయి. ఒకవైపు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే క్యారెక్టర్లు, మరోవైపు సాధారణ మనిషి జీవితంలోని సంక్లిష్టతలను తెరపైకి తీసుకొచ్చే క్యారెక్టర్లు.. ఇలా రెండు విభిన్న ప్రపంచాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఇటీవల ఓటీటీ ప్రపంచంలో వచ్చిన భారీ గుర్తింపు ఆయనకు కొత్త తరహా ఆడియన్స్ ను మరింత దగ్గర చేసింది.
అయితే ఇప్పుడు ఆయన చేయబోతున్న క్యారెక్టర్ మాత్రం కేవలం గెటప్ మార్చుకుంటే సరిపోయే పాత్ర కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహాత్మా గాంధీ లాంటి ఒక చారిత్రక వ్యక్తిని స్క్రీన్‌పై ఆవిష్కరించడం అంటే ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికే ఉన్న ఇమేజ్‌తో పోటీ పడటమే. ముఖకవళికలు, నడక, నిలబడే తీరు, మాట్లాడే విధానం.. ప్రతి చిన్న అంశంలోనూ నటుడిగా మనోజ్ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే ఈ క్యారెక్టర్‌లో మనోజ్ చేసే ట్రాన్స్‌ఫర్మేషన్ ఆయన కెరీర్‌లోనే అత్యంత కఠినమైనదిగా మారే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
తన నేచురల్ యాక్టింగ్ తో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్సులు ఇచ్చి కెరీర్లో ఇప్పటికే ఎన్నో ప్రశంసలు, ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న మనోజ్‌కు మరోసారి ఈ సినిమా రూపంలో తన యాక్టింగ్ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కిందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి అసలు పరీక్ష గెటప్‌లో కాదు.. యాక్టింగ్ లో ఉంది. ఆడియన్స్ స్క్రీన్‌పై మనోజ్ బాజ్‌పాయ్‌ను మర్చిపోయి పూర్తిగా గాంధీ పాత్రనే చూడగలిగితేనే ఈ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. అదే జరిగితే ఇది కేవలం మరో సినిమా కాకుండా.. మనోజ్ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ క్యారెక్టర్ గా నిలిచే అవకాశముంది. అంతేకాదు, ఆయన అవార్డుల జర్నీలో మరో బలమైన అధ్యాయానికి కూడా ఈ పాత్ర నాంది పలకవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.
