తంబీలైతే గుడి కట్టేయడం ఖాయం!
బొద్దుగా కనిపిస్తే చాలు తంబీలు గుడి కట్టేస్తారు. ఖుష్బూ, నమిత లాంటి భామలకు గుడులు కట్టిన చరిత్ర అరవ తంబీలది.
By: Sivaji Kontham | 26 Dec 2025 11:20 PM ISTబొద్దుగా కనిపిస్తే చాలు తంబీలు గుడి కట్టేస్తారు. ఖుష్బూ, నమిత లాంటి భామలకు గుడులు కట్టిన చరిత్ర అరవ తంబీలది. అందుకే ఇప్పుడు మన్నారాను ఇలా చూడగానే తమిళ తంబీలు కచ్చితంగా గుడి కట్టేస్తారు! అంటూ గుసగుస మొదలైపోయింది.
ఇంతకీ ఈ లుక్ ఎక్కడిది? ఎవరి కోసం? అంటే... మన్నారా కొంతకాలంగా హైదరాబాద్ కి దూరంగా ముంబైలోనే ఉంటోంది. ఇటీవల కొన్నిసార్లు పబ్లిక్ ఔటింగుల్లో కనిపించింది. ఇప్పుడు క్రిస్మస్ వేడుకలలో భాగంగా మన్నారా ఇలా బోల్డ్ గా ముస్తాబై వచ్చింది. ఆ సమయంలో కెమెరాలు ఈ భామను చుట్టు ముట్టాయి. అలా కార్ నుంచి దిగుతూనే కెమెరాల ముందు హొయలు పోయింది మన్నారా.
ఇక మన్నారా రాక కోసం ఎంతగానో వేచి చూసిన ఫోటోగ్రాఫర్లను ఏమాత్రం నిరాశపరచకుండా అవసరమైన ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. అయితే తన కోసం ఇంతమంది కెమెరామెన్ లు వేచి చూస్తున్నారని `ఊహించలేదు` అని చెప్పింది మన్నారా!
ఈ క్రిస్మస్ మన్నారా ఐకానిక్ క్రిస్మస్ అని పేర్కొంది. ఎరుపు మినీ డ్రెస్ ధరించి అందమైన క్రిస్మస్ చెట్టు నేపథ్యంతో పాటను పాడుతూ కనిపించిన వీడియోను కూడా మన్నారా షేర్ చేసింది ``గత క్రిస్మస్ సందర్భంగా నేను మీకు నా హృదయాన్ని ఇచ్చాను... కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా, నేను మీకు మరింత వ్యక్తిగతమైనదాన్ని ఇస్తున్నాను - నా స్వరం. నా హృదయం నుండి మీ వరకు నా వైబ్``అని క్యాప్షన్‌లో రాసింది. ఇక మన్నారా బొద్దందం చూశాక యూత్ చలించిపోతున్నారు. తంబీలైతే గుడి కట్టేయడం ఖాయం! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో మన్నారా.. అజీబ్ దస్తాన్ ఆత్మీయ ప్రదర్శనతో గాయకురాలిగా అరంగేట్రం చేసింది. సంగీతం ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ పాట ప్రత్యేకమైనది.. ఎందుకంటే ఇది క్లాసిక్‌లపై నాకున్న ప్రేమను నా కళాత్మక స్పర్శతో మిళతం అవుతుందని చెప్పింది.
మన్నారా ఇటీవల బిగ్ బాస్ 17లో కనిపించింది. ఈ సీజన్ స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ ట్రోఫీని గెలుచుకున్నాడు. అభిషేక్ కుమార్ మొదటి రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నాడు. మన్నారా చోప్రా ఈ సీజన్‌ను రెండవ రన్నరప్‌గా మిగిలిపోయింది. కానీ తనకంటూ భారీగా అభిమానులను సంపాదించుకుంది. మన్నారా చివరిగా సెలబ్రిటీ కామెడీ వంట షో `లాఫ్టర్ చెఫ్స్ సీజన్ 2`లో కనిపించింది. సుదేశ్ లెహ్రీతో కలిసి షోలో పాల్గొంది.
