Begin typing your search above and press return to search.

త‌ల్లి సాధించ‌లేనిది కుమార్తె రూపంలో!

తాజాగా మంజుల ఘ‌ట్ట‌మ‌నేని కుమార్తె, మ‌హేష్ మేన‌కోడ‌లు జాన్వీ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   30 Oct 2025 3:00 PM IST
త‌ల్లి  సాధించ‌లేనిది కుమార్తె రూపంలో!
X

త‌ల్లిదండ్రులు సాధించ‌లేనిది క‌నీసం పిల్ల‌ల రూపంలో సాధించాల‌ని ఎన్నో క‌ల‌లు కంటుంటారు. పిల్ల‌లు కూడా అంతే విధిగా త‌ల్లిదండ్రుల మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. అలాగ‌ని పిల్ల‌లంద‌రూ ఒకేలా ఉండ‌లేరు. త‌ల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ మేర‌కు కాల క్ర‌మంలో కొన్ని ర‌కాల మార్పులు చోటు చేసుకోవ‌డం స‌హ‌జం. తల్లిదండ్రుల కోర్కెలు పిల్ల‌లు నెర‌వేర్చ‌లేదు అని చెప్ప‌డానికి వీలు లేదు. వారికంటూ కొన్ని కోరిక‌లు..క‌ల‌లు ఉంటాయి. వాటిని సాధించుకునే దిశ‌గానూ కొంత మంది పిల్ల‌లు అడుగులు వేస్తుంటారు. త‌ల్లిదండ్రుల కోరిక‌లు మాత్రం పిల్ల‌ల రూపంలో నెర‌వేరితే అంత‌కు మించిన అదృష్ట త‌ల్లిదండ్రులు మ‌రొక‌రు లేన‌ట్లే.

వెండి తెర‌పై స్టార్ హీరోయిన్ గా :

తాజాగా మంజుల ఘ‌ట్ట‌మ‌నేని కుమార్తె, మ‌హేష్ మేన‌కోడ‌లు జాన్వీ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్ల వ‌య‌సులోనే జాన్వీకి మ్యాక‌ప్ వేసారు మంజుల‌. `మ‌న‌సుకు న‌చ్చింది` సినిమాతో లాంచ్ చేసారు. కానీ ఆ త‌ర్వాత కొన‌సాగ‌లేదు. అప్పుడే సినిమాల మీద దృష్టి మ‌ళ్లీస్తే చ‌దువు స‌రిగ్గా ఉండ‌ద‌ని ఆ సినిమాకే ప‌రిమితం చేసారు. అయితే ఆ వ‌య‌సులో త‌ల్లి అలా లాంచ్ చేయ‌డ‌మే జాన్వీకి సినిమాల‌పై మ‌న‌సు మ‌ళ్లింది. అందుకే ఇప్పుడు న‌టిగా ఎంట్రీ ఇస్తుంది. అయితే జాన్వీని వెండి తెర‌పై హీరోయిన్ గా చూసుకోవాల‌న్న‌ది ఆమె క‌న్నా? త‌ల్లి మంజుల క‌న్న గొప్ప క‌ల‌గా క‌నిపిస్తోంది.

మంజుల స‌క్సెస్ కానీ నేప‌థ్యంలో:

మంజుల చిత్ర రంగంలోకి 1990లోనే నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చారు. ఐదారు సినిమాలు నిర్మించారు. అదే స‌మ‌యంలో `షో` సినిమాతో తెలుగులో న‌టిగా లాంచ్ అయ్యారు. అంత‌కు ముందు ఓ మ‌ల‌యాళ చిత్రంలో న‌టించారు. ఆ మ‌రుస‌టి ఏడాది `రాజ‌స్థాన్` అనే త‌మిళ సినిమాలోనూ న‌టించారు. అటుపై మూడేళ్ల గ్యాప్ అనంత‌రం `షో `తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత `కావ్యాస్ డైరీ`లో మంజుల న‌టించారు. ఆ త‌ర్వాత `ఆరెంజ్`, `సేవ‌కుడు`, `మ‌ళ్లీ మొద‌లైంది`, `హంట్`, `మంథ్ ఆఫ్ మ‌ధు`లో కీల‌క పాత్ర‌లు పోషించారు.

న‌టిగా బీజం అలా:

అలా న‌ట‌న‌పై త‌న‌కున్న ఫ్యాష‌న్ చాటుకున్నారు మంజుల‌. కానీ న‌టిగా, హీరోయిన్ గా మాత్రం మంజుల తాను అనుకున్న హైట్స్ కు చేర‌లేదు. ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయారు. అప్ప‌టి నుంచి మంజుల హీరోయిన్ కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడా డ్రీమ్ ను కుమార్తె జాన్వీ రూపంలో తీర్చుకోబొతున్నారు. అందుకే జాన్వీ 10 ఏళ్ల వ‌య‌సులోనే తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మ‌న‌సుకు న‌చ్చింది` తెరంగేట్రంతో బీజం వేసారు. మామ్ క‌ల కోసం డాట‌ర్ కూడా అంతే క‌ష్ట‌ప‌డింది. చిన్న వ‌య‌సులోనే డాన్సు, న‌ట‌న వంటి వాటిపై శిక్ష‌ణ ఇప్పించ‌డం జ‌రిగింది.