Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌ ఇప్పుడు ఏం చేస్తోంది?

నిర్మాత‌గా మ‌హేష్‌తో ఇండ‌స్ట్రీ హిట్ `పోకిరి`, నాగ‌చైత‌న్య‌తో ఎవ‌ర్ గ్రీన్ ల‌వ్ స్టోరీ `ఏమాయ చేసావె`ని నిర్మించి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని ఇండ‌స్ట్రీకి అందించిన నిర్మాత‌గా మంచి పేరు తెచ్చుకుంది.

By:  Tupaki Entertainment Desk   |   6 Feb 2026 8:15 AM IST
ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌ ఇప్పుడు ఏం చేస్తోంది?
X

వార‌సుల‌కు అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశం అంత ఈజీగా ఉండేది కాదు. హీరోల వార‌సుల్లో అబ్బాయికి అయితే నో అబ్జెక్ష‌న్‌. కానీ అమ్మాయిలు ఉంటే అభిమానులు, అభిమాన సంఘాలు న‌టిగా వార‌సురాలు అరంగేట్రానికి ప్ర‌య‌త్నిస్తోంద‌నే వార్త తెలిస్తే చాలు పెద్ద గోల చేసి సినిమాల్లోకి వార‌సురాలు ప్ర‌వేశించ‌డానికి వీళ్లేద‌ని అభిమానులు పెద్ద ఎత్తున వీరంగం వేసే వారు. దాంతో అప్ప‌ట్లో స్టార్‌లు ఓ వెలుగు వెలిగిన హీరోల వార‌సులుగా అమ్మాయిలు సినిమాల్లోకి రావ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. ఆ స‌వాల్‌ని స్వీక‌రించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సురాలు మంజుల‌.

సురేష్ గోపీ, జ‌య‌రామ్ హీరోలుగా, మంజు వారియ‌ర్‌, సంగీత హీరోయిన్‌గా సిబిమ‌ల‌యిల్ రూపొందించిన మ‌ల‌యాళ మూవీ `స‌మ్మ‌ర్ ఇన్ బెత్లేహోమ్‌`తో న‌టిగా అరంగేట్రం చేసింది. ఇందులో న‌టించిన లేడీ క్యారెక్ట‌ర్ల‌లో త‌న‌ది ఫిప్త్ ప్లేస్‌. త‌మిళంలో విజ‌య‌శాంతి న‌టించిన `రాజ‌స్థాన్‌`లో టెర్ర‌రిస్ట్‌గా న‌టించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. `షో` మూవీతో తెలుగులో ప్ర‌యోగాత్మ‌క సినిమా చేసి రెండు జాతీయ పుర‌స్కారాల్ని, మూడు నందీ అవార్డుల్ని సొంతం చేసుకుంది. `మంత్ ఆఫ్ మ‌ధు` వ‌ర‌కు 9 సినిమాల్లో న‌టించింది.

నిర్మాత‌గా మ‌హేష్‌తో ఇండ‌స్ట్రీ హిట్ `పోకిరి`, నాగ‌చైత‌న్య‌తో ఎవ‌ర్ గ్రీన్ ల‌వ్ స్టోరీ `ఏమాయ చేసావె`ని నిర్మించి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని ఇండ‌స్ట్రీకి అందించిన నిర్మాత‌గా మంచి పేరు తెచ్చుకుంది. సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టినా న‌టిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకోవాల‌న్న ఆమె క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది. సెల‌బ్రిటీ వార‌సురాలిగా..బార్న్ టు గోల్డెన్ స్పూన్ అనిపించుకున్నా త‌న తండ్రి త‌ర‌హాలో స‌క్సెస్ కాలేక‌పోయాన‌ని ఫీలైంద‌ట‌. ఆ కార‌ణంగా త‌ను చాలా స్ట్ర‌గుల్ అయ్యాన‌ని, ఎంతో ఎఫెక్ట్ అయ్యింద‌ట‌.

అదే స‌మ‌యంలో త‌న ఫాద‌ర్‌, బ్ర‌ద‌ర్ త‌ర‌హాలో తాను సినిమాల్లోనే ఎందుకు స‌క్సెస్ కావాల‌నుకుంటున్నాన‌ని ఆలోచించి ఫైన‌ల్‌గా రిల‌య‌లైజ్ అయ్యి కొత్త దారిని ఎంచుకుంద‌ట‌. సెలెబ్రిటీ సీక్రెట్ తో అన్ని స‌మ‌స్యల్ని క్రాక్ చేసి టెక్నిక్స్‌ని నేర్చుకుని ఇప్పుడు సెల‌బ్రిటీ ఎన‌ర్జీ హీల‌ర్‌..మెంట‌ర్‌గా సేవ‌లందిస్తోంది. 35 ఇయ‌ర్స్ ఎక్స్‌పీరియ‌న్స్ సెలెబ్రిటీ వెల్‌నెస్ కోచ్ అండ్ ఎన‌ర్జీ హీల‌ర్‌. 1000 ప్ల‌స్ మెడిటేష‌న్ ప్రాక్టీస్ ..ఫ్రీ లైవ్ మాస్ట‌ర్ క్లాస్ హీల్ యువ‌ర్ లైఫ్ 3 సెలెబ్రిటీ సూప‌ర్ సీక్రెట్స్..బాడీ మైండ్ లైఫ్ హీల్‌.. త్రీ ఎగ్జాక్ట్‌ టూల్స్ నేర్పిస్తాను. బోన‌స్ వ‌ర్త్ రూ.4999 ఫ్రీ.. అంటూ సోష‌ల్ మీడియాలో ఫ్రీ మాస్ట‌ర్ క్లాస్‌లు ఇస్తోంది.

ప్ర‌స్తుతం ఈ రంగంలో తాను చాలా హ్యాపీగా ఉన్నాన‌ని చెబుతూ అంద‌రికి ఆద‌ర్శింగా నిలుస్తోంది. ఒక రంగంలో అయిన‌వాళ్లు స‌క్సెస్ అయ్యార‌ని మ‌న‌మెందుకు కాకూడ‌ద‌ని ఆలోచించ‌కుండా మ‌న‌కు న‌చ్చిన, మ‌నం చేయ‌గ‌ల రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగితే అందులో అద్భుతాలు సృష్టిస్తామ‌ని ప్రాక్టిక‌ల్‌గా నిరూపిస్తోంది మంజుల ఘ‌ట్ట‌మ‌నేని.